అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనలపై మంత్రి సంధ్యా రాణి స్పందించారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా, సానుకూలంగా ఉందని వెల్లడించారు. వారికి గ్రాట్యుటీ చెల్లింపు విషయం పరిశీలనలో ఉందని ప్రకటించారు. వారి సమ్మె వల్ల గర్భిణులు, బాలింతలు, పిల్లలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వివరించారు. దీంతో వారు ఆందోళనలను విరమించాలని మంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.