ఆధార్ ఉన్నవారికి అలర్ట్

 



మీ ఆధార్ దుర్వినియోగమైందా? లేదా? తెలుసుకోవాలంటే..

 uidai.gov.in పోర్టల్లోకి మీ ఆధార్ నంబర్, క్యాప్చా, మొబైల్కి వచ్చే OTPతో లాగిన్ అవ్వాలి.

 తర్వాత అథెంటికేషన్ హిస్టరీపై క్లిక్ చేయండి.

 అక్కడ 'ఆల్'ని సెలెక్ట్ చేసి 'ఫెచ్ అథెంటికేషన్ హిస్టరీ'పై క్లిక్ చేస్తే మీ ఆధార్ ఎక్కడెక్కడ ఉపయోగించారనే వివరాలు తెలిసిపోతాయి. మీ ఆధార్ దుర్వినియోగమైనట్లు తెలిస్తే 1947కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.