విశాఖలో న్యాయ విద్య అభ్యసిస్తోన్న యువతిపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. ఆ దృశ్యాలను సెల్ఫోన్లతో చిత్రీకరించి బెదిరిస్తూ పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్యాయత్నం చేయగా తండ్రి కాపాడారు. విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితులు వంశీ, ఆనంద్, రాజేశ్, జగదీశ్ను అరెస్టు చేశారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీని హోంమంత్రి అనిత ఆదేశించారు.