డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రి నర్సులే ఆపరేషన్


 TV77తెలుగు రాజమహేంద్రవరం :

ఆ బాలింత మరణానికి నర్సుల వైద్యమే కారణమా ?

పవిత్ర వైద్య వృత్తిలో శృతిమించుతున్న ధనదాహం

ప్రైవేటు వైద్య చికిత్సలపై కొరవడిన ప్రభుత్వ నియంత్రణ

ఒకప్పుడు వైద్యుల అన్న వైద్యం అన్న పవిత్రత కు. వైద్యులను సాక్షాత్తు దేవునితో పోలిచి జీవితాంతం కృతజ్ఞత కలిగివుండేవారు జనం. నేడు వైద్య విద్య కోట్ల రూపాయలకు చేరి,వ్ దాంతోపాటు అరకొర చదువులతో వృత్తి నైపుణ్యం లేకుండానే , బ్యాంకుల సహకారంతో పెద్ద పెద్ద ఆసుపత్రిలు  నిర్మించి మిడిమిడి జ్ఞానం సిబ్బందితో వైద్య చికిత్సలను రూపాయలుగా మార్చుకుని అక్రమ సంపాదన కొనసాగుతుంది ఈ రంగంలో.  తాజాగా వైద్యుల నిర్లక్ష్యం మూలంగా బాలింత అకాల మరణం చెందడం రాజమండ్రిలో బాధిత కుటుంబంలో విషాదం కలిగించింది. ముక్కు పచ్చలారని చిన్నారి మాతృ ప్రేమ దూరమవడం మే కాకుండా, పసి వాని ఆలనా పాలన, భవిష్యత్తు దుర్భరంగా మిగిల్చింది. స్థానిక దానవైపేట లో కొత్తగా ఏర్పడిన మాగ్నా మదర్ అండ్ చైల్డ్ ఆస్పత్రిలో బుధవారం జరిగిన సంఘటనలో వైద్యుల నిర్లక్ష్యం ఫలితంగా బాలింత దుర్మరణం చెందడంతో పసివాడు కన్న ప్రేమ కు దూరమయ్యాడు. కాన్పు అనంతరం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిమిత్తం ఆసుపత్రిలో జాయిన్ అవ్వగా డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రి నర్సులే ఆపరేషన్ చేశారని ,దాంతో బాలింత మృతి చెందిందని ఆస్పత్రి వద్ద గుమిగూడిన జనం గుసగుసలు వినిపించాయి. మీడియాకు ఈ ఉదంతం పోక్కకుండా ఉండేందుకు చిన్న పెద్ద తేడా ప్రదర్శించి నజరానాలు పంపిణీ జరిగినట్లుగా హల్చల్ చేయడం నగరంలో మీడియా తీరుపై విమర్శలు రావడం గమనార్హం. ఏది ఏమైనా సంఘటన జరిగిన తరువాత స్పందిస్తున్న ప్రభుత్వం ముందు నుండి ప్రైవేట్ వైద్య విధానాలపై ఆస్పత్రిల పై డాక్టర్ల పై నియంత్రణ ఉండటం లేదని విమర్శలు వస్తున్నాయి.