TV77తెలుగు కాకినాడ :
కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబు ను పోలీసులు కాసేపట్లో జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం కోర్టు సమయం ముగియడంతో నిందితుడిని జడ్జి ఇంటికి తీసుకువెళ్లనున్నారు. ఇప్పటికే మండలి చైర్మన్‌తో పాటు అసెంబ్లీ సెక్రటరీకి కూడా సమాచారం అందజేశారు. ఎస్పీ ఆఫీస్ నుంచి అనంతబాబును జడ్జి నివాసానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చనున్నారు. భారీ బందోబస్తు మధ్య అనంతబాబును పోలీసులు తరలించనున్నారు. కాగా మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తాను చంపినట్లు ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.