ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. 'వ్యూహం' సినిమా సమయంలో చంద్రబాబు, లోకేశ్, బ్రాహ్మణిని కించపరిచేలా పోస్టు పెట్టారని టీడీపీ నేత M. రామలింగం ఫిర్యాదు చేశారు. దీంతో మద్దిపాడు PSలో ఐటీ చట్టం కింద RGVపై కేసు నమోదు చేశారు. కాగా చంద్రబాబు, పవన్, లోకేశ్లపై అనుచిత పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తలను ఇప్పటికే అరెస్టులు చేస్తున్న విషయం తెలిసిందే.