కాంగ్రెస్ నేతల్ని రక్షిస్తున్న బిగ్ బ్రదర్ ఎవరు? KTR


 తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఈడీ కేసుల నుంచి రక్షిస్తున్న బిగ్ బ్రదర్ ఎవరని KTR ప్రశ్నించారు. 'ఇటీవల ఓ మంత్రిపై ఈడీ దాడులు జరిగాయి. రూ.100 కోట్లు దొరికినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై ఇంతవరకు కాంగ్రెస్, బీజేపీ, ఈడీ నుంచి ఒక్క మాట కూడా రాలేదు. వాల్మీకి స్కామ్ ని రూ.40 కోట్లను తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో వాడిందని కర్ణాటకలో ఈడీ పేర్కొంది. ఇప్పటివరకు అరెస్టులు లేవు' అని చురకలంటించారు.