భారతదేశంలో ఈ వి ఎమ్ ఎన్నికలను భహిష్కరించాలి: మేడా శ్రీనివాస్ ఆరోపణ

 ఈ వి ఎమ్ లపై అన్ని రాజకీయ పార్టిలు ఒక వేదిక పైకి రావాలి.

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికలు సైతం ఈ వి ఎమ్ ల మయాజాలమే.

కార్పొరేట్ మాఫియా వున్నంతవరకు ఈ వి ఎమ్ లదే గెలుపు.

గతంలో ఒక కార్పొరేట్ రాజకీయ వ్యాపార పార్టీ 

ఈ వి ఎమ్ కుట్రను వాడుకుంది. నేడు మోడీ సర్కార్ వాడుకుంటుంది .

రాజమహేంద్రవరం..

మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ ఆర్ మరణం కూడా ఈ వి ఎమ్ కుట్రలో


భాగమే నని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సందేహం వ్యక్తం చేసారు.

ఒకప్పుడు ప్రజల నాడిని బట్టి ముందుగానే విశ్లేషకులు గెలుపు ఓటములు కోసం చెప్పగలిగే వారని, 

ఆ తరువాత ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ముందస్తు సర్వే ల పేరుతో ఓటర్లను వాస్తవాలను, జరిపిన కుట్రలను గమనించకుండా ప్రజలు దృష్టి మళ్ళించే విధంగా సర్వే లకు వ్యూహత్మకంగా కుట్రలో భాగంగా బానిసలను చేసారని, నేడు పోటిలో వుంటున్న అన్ని కార్పొరేట్ రాజకీయ పార్టీలు ఓటర్ల ను ఓటుకు నోటుకు బానిసలుగా మార్చి 

ఈ వి ఎమ్ లను నిర్థిష్ట రాజకీయ పార్టి కనుసైగలో ఆపరేట్ చేసే పార్టి మాత్రమే విజయం సాధించే విధంగా అంతర్జాతీయ కార్పొరేట్స్ సాంకేతిక ప్రోగ్రాం డిజైన్ చేస్తారు . ఎన్నికల విజయాలను ప్రకటించిన తదుపరి ఓటర్లు అమ్ముడు పోయారానే నెపంతో వారి సొంత కార్పొరేట్ మీడియాల్లో బారిగా వార్తలు వ్రాయించటమే ఈ కుట్రలో ప్రధాన భాగం అని , నిజానికి ఓటరు పోటి చేసిన కార్పొరేట్ వ్యాపార రాజకీయ పార్టీల అభ్యర్డులందరు నుండి డబ్బు తీసుకునే విధంగా ఏక మార్గం చేసుకుంటారని, అలాంటప్పుడు ఈ వ్యాపార పార్టిల్లో ఒక్కరు మాత్రమే ఎలా గెలుస్తున్నారనే ఆలోచన ప్రజల్లో రాకుండా ఖరీదైన ప్రచార మధ్యమాల ద్వారా వాస్తవాలను భూస్థాపితం చేయటమే 

ఈ కుట్రలో ప్రధాన భాగమని, కార్పొరేట్ వ్యాపార రాజకీయ పార్టీల్లో అంతర్జాతీయ కార్పొరేట్ ఆశీస్సులు వున్నవారు మాత్రమే భారత్ లో గెలిచే అవకాశాలు వుంటున్నాయని , ఎందుకంటే ఓటర్లు పోటిలో వున్న కార్పొరేట్ రాజకీయ పార్టి దారులందరు నుండి ఓటుకు నోటు తీసుకుంటారని, అందుచేత ఓటర్లను నమ్ముకుంటే గెలుపు సాధ్యం కాదని , ఓటుకు నోటు ముసుగులో ఈ వి ఎమ్ కుంభకోణాన్నే నమ్ముకుని భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తు భారతదేశ భవిష్యత్ ను అంతర్జాతీయ కార్పొరేట్ మాఫియాకు తాకట్టు పెట్టడమే భారత రాజకీయాలుగా నేడు నడుస్తున్నాయని , భారతదేశంలో ఈ వి ఎమ్ ఎన్నికలను ప్రజలు భహిష్కరించిన నాడే భారత్ అత్యంత సంపన్న దేశంగా అవతరిస్తుందని ఆయన ఆశాబావం వ్యక్తం చేసారు.

భారతదేశంలో గల అన్ని ప్రజా స్వామిక రాజకీయ పార్టిలు కార్పొరేట్ వ్యాపార రాజకీయ పార్టిలకు వ్యతిరేకంగా ఒకే వేదిక మీదకు వచ్చి భారతదేశ అత్యున్నత ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన తరుణం ఆసన్నమైనదని, నోటుతో ఓటర్ల దృష్టి మళ్ళిస్తూనే అతిపెద్ద బారి స్థాయిలో 

ఈ వి ఎమ్ ల కుంబకోణం జరుగుతుందని , భారత్ లో ఎన్నికల సంఘం పూర్తిగా కలుషితం అయ్యిందని , రాజ్యాంగాన్ని , చట్టాలను రచరిక నేరలకు అనుకూలంగా మార్చుకుంటు ఎన్నికల విధానాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని , పాలకులు బందిపోటుల మాదిరి వ్యవస్థను దోచుకుంటున్నా ప్రభుత్వాలు చోధ్యం చూడటం తప్ప చేసేది లేకపోతుందని , ఓటు వేయటం వరకే ఓటరు పని అని, ఆ ఓటు ఎవరికి చేరలో అంతర్జాతీయ కార్పొరేట్ మాఫియానే నిర్దేశిస్తుందని , సాంకేతికంగా మన కన్నా 100 రెట్లు ముందున్న అమెరికా వంటి దేశాలు 

ఈ వి ఎమ్ లను భహిష్కరించి బ్యాలెట్ ను అనుసరిస్తు ఓటు భద్రతను, పవిత్ర తను కాపాడు కుంటున్నాయని , గత 20 ఏళ్ల క్రితమే 

ఈ వి ఎమ్ ల మాయాజాలానికి అంకురం నాటారని, ఇప్పుడు మహా కుంబకోణ వృక్షంగా భారతదేశ వినాశనాన్ని సాసిస్తుందని , భయం, భలహీనతలను వదులుకుని ప్రతి భారతీయుడు ప్రజాస్వామ్య రక్షణకు నడుం బిగించాలని , అందుకోసం సామాజిక భాద్యతలు గల అన్ని రాజకీయ పార్టిలు ఒకే వేదిక మీదకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ మధ్య కాలములో జరిగిన ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికల్లో ఈ వి ఎమ్ కుట్రనే కీలక పాత్ర పోషించిందని , పోటి దారులపై 

ఆ నియోజకవర్గ ప్రజలు బారి స్థాయిలో తిరుగుబాటు చేసినా, వారి చిత్ర పఠాలను, కార్యాలయాలను ప్రజలు అగ్నికి ఆహుతి చేసి నోటికొచ్చిన శాపనార్ధాలు పెట్టినా ఆ అభ్యర్థులకు వేలల్లో ఊహకందని బారి మెజార్టీలు వచ్చాయని, కొన్ని నియోజకవర్గాల్లో వున్న ఓట్లకు మించి ఓట్ల శాతం పోలైన ఘటనలు చోటు చేసుకున్నాయని  , ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసినా కనీస స్పందన లేకపోగా అక్రమ ఎన్నికలకు మద్దత్తుగా నిలిచి పిర్యాదు దారుల ఆత్మస్టైర్యాన్ని దెబ్బతీసారని, 2024 లో జరిగిన ఎన్నికల మోసాలు ఊహకందని స్థాయిలో జరిగాయాని, చట్టాలను , రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మరీ పాలకులు, కార్పొరేట్స్ , ఎన్నికల సంఘం ఈ దఫా ఎన్నికలు జరిపించి ఓటర్ల మనోభావాలను దెబ్బతీసారని ఆయన ఘాటుగా విమర్శించారు.

భారతదేశంలో అంతర్జాతీయ కార్పొరేట్ మాఫియా వ్యాపారాలను మన వ్యాపార రాజకీయ పార్టిలు స్వాగతిస్తు వారికి బానిసలుగా ఊడిగం చేస్తున్నన్నాళ్ళు భారత్ లో ఈ వి ఎమ్ లు గెలుస్తూనే ఉంటాయి. ప్రజాస్వామ్యం ఓడిపోతూనే ఉంటుంది. ఓటరు బక్కచిక్కి పోతు దోపిడీకి బలైతూనే ఉంటాడు. ప్రస్తుత 

ఈ వి ఎమ్ ల మాయాజాలాన్ని ప్రస్తుత మోడీ సర్కార్ ఒక్కటే వాడుకుంటుందంటే పొరపాటే గత యు పి ఏ సర్కార్ సైతం ఈ వి ఎమ్ ల కుట్రనే వాడుకుని భారత రాజకీయాలను సాశించాయని, అప్పుడు 

వై ఎస్ ఆర్ ఆధ్వర్యంలో జరిపిన కుట్ర కారణంగానే అతని మరణానికి సైతం కార్పొరేట్ మాఫియా కుట్ర దాగి వుందని అనేక పుకార్లు సికార్లు చేసాయని, ఒకానొక సందర్భంలో గతంలో రాజమండ్రి ఎంపిగా గెలిచిన ఉండవల్లి అరుణ్ కుమార్ తను గెలిచిన రెండుసార్లు 

ఈ వి ఎమ్ ల వల్లనే గెలిచానని, బ్యాలెట్ సమయంలో ఓడిపోయానని అందుకు వై ఎస్ ఆర్ కు నేను ఎల్లవేళలా ఋణగ్రస్తుడునని ఒక వాస్తవాన్ని అంగీకరించిన ఘటనను నేడు గుర్తు చేస్తున్నామని , దురదృష్ట వసాత్తు భారతదేశంలో సర్కార్ నేరలను చేదించగల నేర పరిశోధన సంస్థ లేకపోవటం భారతీయులను వెంటాడుతున్న తీవ్ర ఘోష అని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్ర ఆవేదన చెందారు.

ఈ సభకు అర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో అర్పిసి సెక్యూలర్స్ సర్వశ్రీ సిమ్మా దుర్గారావు, దూడ్డే త్రినాద్, ఎమ్ డి హుస్సేన్ , వర్ధనపు శరత్ కుమార్, వల్లి శ్రీనివాసరావు, గుడ్ల సాయి దుర్గా ప్రసాద్ , బసా సోనియా, ఆకుల మణికాంత్ బత్తెన శివన్నారాయణ, దోషి నిషాంత్,  నాగూరు అన్నపూర్ణ, మాసా లక్ష్మి , మాసా రత్న కుమారి, నాగూరు దుర్గ , సుంకర వెంకట భాస్కర రంగారావు, అడపా దేవుడు తదితరులు పాల్గొనియున్నారు.

మేడా శ్రీనివాస్ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్.