రాజమహేంద్రవరం
"ఏజెన్సీ టైగర్" ముత్యాల ముత్యాల రాయుడు మిత్రమండలి, మేడా మహా మిత్రమండలిల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీ రాజమహేంద్రవరం ఆనంద్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్ (జమున స్కూల్) సమీపంలోని సమాజ సేవకురాలు కొట్టాపు దేవి నివాసం వద్ద సాయంత్రం ఆర్యాపురం ఆకుల అపార్మెంట్స్ ఎదురుగా నిర్వహించ తలపెట్టిన భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతి వేడుకల ఆహ్వాన పత్రాన్ని మిత్రమండలిల గౌరవ సలహాదారు మేడా శ్రీనివాస్ ఆదివారం ఆర్పీసి ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. దేశ సమైక్యత కోసం జీవితాంతం కృషి చేసిన పటేల్ జయంతి వేడుకల విజయవంతానికి తన సంపూర్ణ సహాయ సహకారాలను అందించగలనని మేడా ఈ సంధర్బంగా నిర్వహకులకు హామీ ఇచ్చినట్లు "ఏజెన్సీ టైగర్" ముత్యాల ముత్యాలరాయుడు మిత్రమండలి ప్రజా సంబంధాల అధికారి సంగిరెడ్డి వెంకట రమణ (రెడ్డి రమణ), మేడా మహా మిత్రమండలి ప్రజా సంబంధాల అధికారి కొమ్ము సుధిర్ కుమార్ లు ప్రకటనలో తెలిపారు.