ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణ

 


తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డీఎస్సీ పరీక్ష కోసం ఉచితంగా వసతితో కూడిన శిక్షణను ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి సందీప్ తెలిపారు. ఈ మేరకు ఆయన రాజమహేంద్రవరంలో మంగళవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. మూడు నెలలపాటు అందించే ఈ శిక్షణను పొందేందుకు అర్హత కలిగిన వారందరూ https:// jnanabhumi.ap.gov.in ద్వారా ఈనెల 21 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.