త్వరలో వైన్ షాపుల్లో పర్మిట్ రూమ్లు?

 


మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు రూ.5 లక్షలు ఫీజుగా వసూలు చేస్తుందని సమాచారం. త్వరలోనే దీనిపై సర్కార్ ఓ నిర్ణయం తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. కాగా నేటి నుంచి రాష్ట్రంలోని 3,396 ప్రైవేట్ మద్యం దుకాణాలు తెరుచుకుంటాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయిస్తారు. అన్ని ప్రముఖ బ్రాండ్లు అందుబాటులో ఉంటాయి.