TV77 తెలుగు రాజమండ్రి రూరల్ :
నవరత్నాలతో ప్రతి ఇంటా సంక్షేమ కాంతులు
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్
ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి పాలనలో ప్రతి ఇంట సంక్షేమ కాంతులు విరజిల్లుతున్నాయని రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ పేర్కొన్నారు
శుక్రవారం నాడు కడియం మండలం చైతన్య నగర్ గ్రామం నందు గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా సంబంధిత అధికారులు మరియు నాయకులతో కలిసి రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నది లేనిది ఆరాతీశారు.సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ మాట్లాడుతూ నవరత్నాల పథకాలతో పాటు ఎన్నో పథకాలను సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తూ పేదవారి ఆర్థిక సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంతోనే వైఎస్ఆర్ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలు అమ్మ ఒడి, రైతు భరోసా,నాడు-నేడు, సామాజిక పింఛన్లు,ఆసరా చేయుత,తదితర పథకాల పట్ల ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని మరలా తప్పకుండా వైయస్సార్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ప్రతీ ఒక్కరు చెప్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అందరి సంక్షేమమే అజెండాగా ముందుకు వెళ్తున్నాం అన్నారు.ఈ కార్యక్రమంలో మాధవరాయుడుపాలెం ఇంచార్జి సంగీత వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ రానా హరిశచంద్ర, సాప్ డైరెక్టర్ భీమిరెడ్డి నాగేంద్ర, వ్యవసాయ సలహా మండలి డైరెక్టర్ ఈలి గోపాలం, ఎంపీడీఓ రత్నకుమారి, కడియం మండల బూత్ ఇంచార్జి తాడలా చక్రవర్తి, వార్డు మెంబెర్ పొనగంటి లోవరాజు, సచివాలయం కన్వీనర్స్ కే. సత్తిబాబు, హనుమంతు, సానబోయిన ఈశ్వరకుమార్, చైతన్య నగర్ నాయకులు పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.