సంక్షేమ పథకాలతో ఆర్థికాభివృద్ధి సాధించాలి:ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపు


 TV77 తెలుగు రాజమహేంద్రవరం:

మత్స్యకారుల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ఉపయోగించుకుని,ఆర్థికంగా అభివృద్ధి సాధించి, ఉన్నత స్థానాలకు చేరుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో శనివారం జరిగిన జాంపేట ఫిష్ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత పొడవైన తీరప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీడీపీలో ఆక్వా ఉత్పతుల భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నా యన్నారు. మత్స్యకార భరోసాతో పాటు సబ్సిడీపై రుణాలు,వాహనాలు అందించే పలు పథకాలు అమలవుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలతో మత్స్యకారులు ఆర్థికంగా ఎదగడానికి తోడుగా నిలబడుతోందన్నారు.ఈ పథకాలను మత్స్యకారులు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.జాంపేట ఫిష్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు వెలమ లక్ష్మణ రావు తన తండ్రి జక్కంపూడి రామ్మోహనరావు కాలం నుంచీ ఆయనకు తోడుగా అనేక కార్యక్రమాల్లో భాగస్వాము లయ్యారన్నారు. మత్స్యకారుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చి, వాటి పరిష్కారానికి కృషిచేస్తున్నారని ఎమ్మెల్యే రాజా కితాబిచ్చారు.జాంపేట ఫిష్ మార్కెట్ కమిటీ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన వెలమ లక్ష్మణరావు, ఇతర కమిటీ సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫిష్ మార్కెట్ నూతన కమిటీ అధ్యక్షులు వెలమ లక్ష్మణరావు, కార్యదర్శి వీరబాబు, కంచి ప్రభాకర్ రావు, వెలమ లక్ష్మి, పాపాయమ్మ, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.