TV77 తెలుగు ఏలూరు:
ఏలూరు జిల్లాలో రైలు ప్రమాదం తృటిలో తప్పింది. షిర్డీ నుంచి విశాఖపట్నం వెళ్తున్న షిర్డీ రైలు సాయంత్రం 5గంటల సమయంలో ఏలూరు రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం నెంబరు - 2 కి చేరుకుంది.రైలు స్టేషన్‌లోకి రాగానే ఎస్2 . ఎస్3 బోగీల మధ్య ఉన్న కప్లింగ్ విరిగిపోయి లింక్ తెగిపోయింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే రైలును నిలిపివేశారు. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అందరూ సురక్షితంగా ఉండటంతో ఘోర ప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కప్లింగ్ విరిగిపోయిన బోగీని పక్కకు తొలగించి అందులోని ప్రయాణికులకోసం మరో బోగి అమర్చారు. మరమ్మతుల అనంతరం 7.22గంటల తర్వాత రైలు విశాఖపట్నం బయలుదేరింది.