ఆ ఊర్లో తుపాకుల కలకలం


 TV77 తెలుగు కాకినాడ రూరల్ కరప:

కాకినాడ రూరల్, కరపలో తుపాకుల కలకలం ఎటువంటి అనుమతులు లేకుండా నాటు తుపాకీలు వినియోగిస్తున్న అయిదుగురిని అదుపులోకి తీసుకుని 10 తుపాకులు స్వాధీనం చేసుకున్నామని కరప ఎస్సై రమేష్ తెలిపారు. వీరంతా పంటపొలాలు, తోటలు,చెరువుల వద్ద పక్షులను వేటాడుతున్నారనే సమాచారం మేరకు సిబ్బందితో వెళ్లి దాడి చేసి పట్టుకున్నామన్నారు.గొర్రిపూడిలో నాలుగు, గురజనాపల్లిలో మూడు,కొంగోడులో రెండు, నడకుదురులో ఒక నాటు తుపాకీ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.