TV77 తెలుగు రాజమహేంద్రవరం :
రాజమహేంద్రవరం గ్రామీణ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి నేడు మల్లయ్య పేట బ్రహ్మం గారి గుడి దగ్గర విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సృష్టికర్త శ్రీ భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గోరంట్ల విశ్వకర్మ లందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే గోదావరి పుష్కర ఘాట్ దగ్గర విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ గాయత్రి విశ్వకర్మ శాంతి యజ్ఞంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మచ్చేటి ప్రసాద్, మార్ని వాసుదేవ్, గంగిన హనుమంతరావు, బిక్కిన సాంభు, కొల్లి వెంకట్రావు, అచ్చుల విజయ్, నల్లబోతుల భవాని, నక్కా ఆనంద్ బాబు, మద్దా మణి, రాంబాబు, భగవాన్, బేరి నాగేశ్వరరావు,గంగిన నాని,మదిపట్ల చిన్ని తదితరులు పాల్గొన్నారు.