TV77 తెలుగు రాజమహేంద్రవరం :
బంగారు భవిష్యత్తు కోసం చెన్నై వెళ్లి మెరైన్ ఇంజనీరింగ్ కోర్స్ చదువు నిమిత్తం వెళ్లిన కుర్రాడు తల్లిదండ్రుల ఆశయాలను చిదిమేస్తూ కడలి పాలవడం హృదయ విదారిక సంఘటన పలువురిని కలిసి వేసింది. రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న వర్మ మెస్ అధినేత మెజీషియన్ పేరుబడ్డ చల్లగాలి శ్రీనివాస్ వర్మ కుమారుడు శోభిత్ వర్మ (15) చెన్నైలో కోయలం బీచ్ లో విహారానికి వెళ్లి సముద్రంలో మునిగి దుర్మరణం పాలయ్యాడు. 15 రోజుల క్రితమే చెన్నైలోని అమిత్ ఇంజనీర్ఎన్ కళాశాలలో చేరాడు. తల్లిదండ్రులు చల్లగాలి శ్రీనివాస్ వర్మ, ఎస్ వి ఆర్. కళ్యాణి మీడియాకు వివరాలు తెలిపారు. కాలేజీ పొండ్రి ఇంచార్జ్ సంపత్ గారు, సంప్రదించగా. బాబు జాయినింగ్ కళాశాలలోని నియమ నిబంధనలు ఏమిటి అని అడగగా పేరెంట్స్ పర్మిషన్ లేకుండా బయటికి పంపించడానికి అవకాశం ఉండదు. కళాశాలకు చెందిన ఇద్దరు సీనియర్ విద్యార్థుల అనుమతి మరియు హాస్టల్ ఇన్చార్జ్ (డీన్) పొండ్రి ఇంచార్జ్ సంపత్ గారు, అనుమతులు తప్పనిసరి. వీరి అనుమతులతో పటు గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ ఔటింగ్ రిజిస్టర్లో కంపల్సరి సంతకం చేసిన తర్వాత బయటికి పంపించడం జరుగుతుంది. అని చెప్పినారు. ఆరోజు ఆదివారం నాడు సహా 5 విద్యార్థులు పిలిచిన మేరకు, బాబు శోభిత్ వర్మ వారి తో కలిసి లోకల్ గా ఉన్న విద్యార్థి ఇంటికి భోజనానికి వెళ్లారు. అక్కడ నుంచి బీచ్కు వెళ్లారు. బీచ్ లో స్నానం చేసిన సెల్ఫీ దృశ్యాలను తల్లిదండ్రులకు శోభిత్ వర్మ పంపించాడు. ఈ దృశ్యాలు తర్వాత మాయం అయ్యాయి. బాబుకు సంబంధించి చెన్నైలో పాస్పోర్ట్త్తు బుకింగ్ మూడో స్లాట్ లో వివరాలు అందించడానికి రాజమండ్రి నుంచి వర్మ దంపతులు ట్రైన్ లో బయలుదేరి వెళుతున్నారు. ఆరోజు రాత్రి 8 గంటలకు వర్మ దంపతులకు కళాశాల యాజమాన్యం నుంచి మీ బాబు కనిపించడం లేదని ఫోన్ చేసి తెలిపారు. ట్రైన్ దిగిన వెంటనే అమిత్ యూనివర్సిటీ వైస్ సాన్సులర్ తో పాటు మరో నలుగురు కళాశాల సిబ్బంది. బాబు చనిపోయిన విషయం చెప్పకుండా ముందుగా గెస్ట్ హౌస్ తీసుకువెళ్లారు. బాబు ను మా సిబ్బంది వెతుకుతున్నారు మీరు ముందుగా ఫ్రెష్ అవ్వండి అని చెప్పారు. అయితే మేము ఒప్పుకోకుండా బాబు దగ్గరికి నడండి అని గట్టిగా చెప్పడంతో కళాశాల దగ్గరకు తీసుకువెళ్లి అక్కడ నుంచి సముద్రం బీచ్ దగ్గరకు తీసుకువెళ్లారు. బీచ్ లో స్థానానికి ఐదుగురు విద్యార్థులు వారిలో శోభిత్ వర్మ స్థానానికి దిగారు వారిలో శోభిత్ వర్మ మినహా మిగతావారు అందరూ క్షేమంగా బయటపడటం వెనుక కుట్ర కోణం ఉందని అనుమానం పడుతున్నామని దంపతులు తెలిపారు. సముద్ర నుంచి బయటపడిన ఒక విద్యార్థితో మాట్లాడించారు మిగతా వారిని బయటపడనివ్వకుండా చర్యలు తీసుకున్నారు అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై లోకల్గా మూడు పోలీస్ సషన్లో ఫిర్యాదు చేయడానికి మృతుడు తల్లిదండ్రులు ప్రయత్నాలు చేసినప్పటికీ యూనివర్సిటీ యాజమాన్యం ఒత్తులతో ఏ పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు స్వీకరించలేదు అని వర్మ దంపతులు వాపోయారు. ఊరు గాని ఊరు వచ్చి భాష గాని భాష రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట కల్పించాల్సిన కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల నిబంధనలు కచ్చితంగా పాటించకపోవడం వల్ల ఒక విద్యార్థి బంగారు భవిష్యత్తు కోర్సులో చేరిన కేవలం 15 రోజులు వ్యవధిలోనే నాశనం అవడం కాక జీవితాన్ని కోల్పోవడం పూర్తిగా యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం యాజమాన్యంపై చట్టపరమైన, న్యయపరమైన చర్యలు తీసుకోవాలని మృతుని కుటుంబానికి తగిన విధంగా నష్టపరిహారం చెల్లించాలని బాధితుల ఫిర్యాదును స్వీకరించని పోలీస్ స్టేషన్ ల అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మృతిని తల్లిదండ్రులు శ్రీనివాస్ వర్మ దంపతులు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఏ విద్యార్థికి ఇటువంటి సంఘటన జరగకూడదని ఆ విధంగా కళాశాల యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు .ఇ టువంటి దుర్ఘటన చోటుచేసుకుని కన్నవారి కడుపుకోతకు గురికావడం ఎంతో విషాధికారం వర్మ కుటుంబానికి ప్రధాన సానుభూతి తెలియజేస్తూ యువకుని ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూరాలని వర్మ కుటుంబానికి మనోధర్యం కలిగించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం.