TV77తెలుగు బాలాపూర్ :
బాలాపూర్ లడ్డూ వేలంలో తన రికార్డ్‌ను తానే బ్రేక్ చేసింది. వేలంపాటలో లడ్డూ రూ. 24.60 లక్షలు పలికింది. ఇది గతేడాది కంటే రూ. 5.40 లక్షలు అధికం.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయిన బాలాపూర్ లడ్డూ వేలం ముగిసింది. గతేడాది ధరను బ్రేక్ చేస్తూ.. రికార్డ్ స్థాయిలో లడ్డూ ధర పలికింది. వేలంలో వంగేటి లక్ష్మారెడ్డి రూ. 24.60 లక్షలకు లడ్డూని దక్కించుకున్నారు. అయితే, గతేడాది కంటే 5.40 లక్షలు అధిక ధర పలికింది. గతేడాది బాలాపూర్ వినాయకుడి లడ్డూ 18.90 లక్షలు పలుకగా.ఈ ఏడాది ఏకంగా రికార్డ్ స్థాయిలో 24.64 లక్షలు పలికింది.