TV77తెలుగు రాజమహేంద్రవరం :
అజాద్ కా అమృత్ మహోత్సవం అభివృద్ధి పేరిట లాలాచెరువు రుడా పార్క్ నాశనం
రు.11 లక్షల ప్రజా ధనం వృధా శాఖల మధ్య సమన్వయం లేని వైనం
అభివృద్ధి పేరిట కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రైవేటు సంస్థలు (సి ఎస్ ఆర్) కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తుండగా అమలు చేయాల్సిన అధికారులు, ప్రభుత్వ శాఖలు నిర్లక్ష్యం. సమన్వయం లేమితో కోట్లాది రూపాయల ప్రజలు ధనం నిరుపయోగ అవుతున్నాయి. ప్రభుత్వాలు ,అధికారులు మారినప్పుడల్లా అంతకు ముందు నిర్మించిన కట్టడాలు, నిర్మాణాలు కూల్చివేయడం లేదా, మళ్లీ కొత్తగా కోట్ల రూపాయల ఖర్చు చేసి నిర్మాణాలు చేపట్టడం అధికారులకు తంతుగా మారింది. ప్రభుత్వాలు ఒకపక్క చెట్లను పెంచండి , పర్యావరణాన్ని కాపాడండి జాతీయ జెండా పట్టుకోండి. దేశభక్తి ని చాటండి అని ఉపన్యాసాలు, ప్రసంగాలు గొప్పగా చెప్పడం ప్రజా ప్రతినిధులు. నాయకులకు రివాజుగా మారింది. తాజాగా రాజమహేంద్రవరం ముఖ ద్వారం లాలాచెరువు జంక్షన్లో 2019 లో రు.11 లక్షల రుడా గుడా) నిధులతో ట్రయాంగిల్ కార్గిల్ యుద్ధ వీరుల స్మారక పార్కును అభివృద్ధి చేశారు. గత మూడేళ్లుగా పార్కు నిర్వహణను, అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిన అధికారులు అజాద్ కా అమృత్ మహోత్సవాలలో కళ్ళు తెరవడం విస్మయాన్ని కలిగిస్తోంది. పార్క్ లో మూడు సంవత్సరాల క్రితం పది సంవత్సరాల వయస్సు గల ఓక్ వృక్షాలు నాటి, వాటర్ ఫౌంటెన్ లు ఏర్పాటు చేసి గ్రీనరీ మొక్కలతో అభివృద్ధి చేశారు. అయితే ఇంతవరకు మున్సిపల్ కార్పొరేషన్ గానీ. ఉద్యానవన శాఖ గాని. దత్తత తీసుకున్న ప్రైవేటు సంస్థల గాని పార్క్ నిర్వహణ ను గాలికి వదిలేశాయి.అజాద్ కా అమృత్ మహోత్సవం సందర్భంగా నగరంలో నిర్వహణ కొరవడి ఎన్నో పార్కులు.ప్రదేశాలు. ట్రాఫిక్ ఐలాండ్ లు అభివృద్ధి చేయడం మానేసి 11 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసిన లాలాచెరువు ట్రయాంగిల్ కార్గిల్ యుద్ధ వీరుల స్మారక పార్కు లో అభివృద్ధి పేరిట చెట్లు తొలగించడం. విగ్రహాలు ధ్వంసం చేయడం. వంటి చర్యతో నాశనం చేస్తున్న అధికారుల తీరుపై స్థానిక ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. నిర్వహణ చేస్తే సరిపోయే పార్కును మళ్లీ లక్షల రూపాయల ప్రజాధనం తో కొత్తగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏముందని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అభివృద్ధి పేరిట ప్రజాధనాన్ని దోచుకోవడానికే ఇటువంటి పనులు చేస్తున్నారని అధికారుల మధ్య, శాఖల మధ్య సమన్వయం లేదని తేటతెల్లమవుతుంది. నగర భవిష్యత్ ప్రణాళిక . మాస్టర్ ప్లాన్ పట్ల దూరదృష్టి లేని అధికారుల మొక్కుబడి వైనానికి పార్క్ పనులు నిదర్శనంగా నిలుస్తున్నాయి.