టన్నుల పిడిఎస్ బియ్యం స్వాధీనం


 TV77తెలుగు మండపేట :

కేశవరం లో పిడి ఎస్ బియ్యం నిల్వచేసిన రైస్ మిల్లు పై విజిలెన్స్ దాడి

మిల్లు యజమాని అభిరెడ్డి సత్యం పై కేసు నమోదు.

మండపేట మండలంలోని కేశవరం గ్రామంలో పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా  నిల్వ చేసిన రైస్ మిల్లులపై విజిలెన్స్ శాఖ అధికారులు దాడులు చేసి లారీ ని ,బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు రైస్ మిల్లు యజమాని అభిరెడ్డి సత్యం పై 6A కేసు నమోదు చేసి మండపేట రూరల్ పోలీసులకు అప్పజెప్పారు. ఈ సందర్భంగా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. లారీ స్వాధీనం చేసుకున్నారు. పిడిఎస్ బియ్యం సుమారు 4 లక్షల రూపాయలు ఉంటుందని బియ్యాన్ని మండలం సప్లై గుడోన్ కు తరలించామని విజిలెన్స్ ఎస్పి రవికుమార్ తెలిపారు.