TV77తెలుగు రాజమహేంద్రవరం :
రాజమండ్రి ఎంపీ భరత్ రామ్ ఫోను చోరీకి గురైంది. రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో ఎంపీ భరత్ ఫోన్ మిస్సైనట్లు తెలిసింది. తన ఫోన్ చోరీకి గురైందిఅంటూ ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరిసారిగా మంగళవారం ఉదయం తాను విమానాశ్రయంలో గాడాల కు చెందిన పారిశ్రామికవేత్త శిరీష తో సెల్ఫీ దిగానని. ఆ తర్వాత కనిపించలేదని ఎంపీ భరత్ తెలిపారు. కోరుకొండ పోలీసులు విచారణ చేపట్టారు.