TV77తెలుగు అమరావతి :
ఆంధ్ర ప్రదేశ్ లో నేటి నుంచి రాష్ట్రంలో పాఠశాలలు పున:ప్రారంభంకానున్నాయి. నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం స్కూళ్ల మెర్జింగ్ పూర్తికావడంతో విలీనమైన బడుల్లోని 3,4,5 తరగతుల విద్యార్థులు సమీపంలోని ప్రీహైస్కూలు, హైస్కూలుకు వెళ్లనున్నారు. మరోవైపు తొలిరోజు నుంచే విద్యార్థులకు విద్యాకానుక కిట్లను పంపిణీ చేయనుంది ప్రభుత్వం.