TV77తెలుగు హైదరాబాద్:
తెలుగురాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నైరుతి రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయన్నారు. తెలంగాణలోని యాదాద్రి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, సూర్యాపేట, జనగాం, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.హైదరాబాద్‌లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఆఫీస్‌లకు, స్కూళ్లకు వెళ్లే సమయం కావడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మూడు రోజులపాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతవరణ శాఖ పేర్కొంది.దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాకు ఆనుకుని వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ నైరుతి వైపునకు ఒంగి ఉంది. ఇంకా మహారాష్ట్ర నుంచి కేరళ వరకు తీర ద్రోణి, ఉత్తర కోస్తాలో శ్రీకాకుళం, దక్షిణ ఒడిశాపై నుంచి తూర్పు, పడమర ద్రోణి వేర్వేరుగా విస్తరించాయి. అలాగే గుజరాత్ నుంచి ఒడిశాలోని గోపాల్‌పూర్ మీదుగా బంగాళాఖాతం వరకు రుతుపవనద్రోణి కొనసాగుతుంది. వీటన్నింటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున గురువారం కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిశాయి.