TV77తెలుగు రాజమహేంద్రవరం రూరల్:
దామిరెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారము నాడు రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ గ్రామములో పర్యటించి, కాలువలను మరియు రోడ్లు ను ఆయన పరిశీలించారు, అనంతరము పంచాయతీ సెక్రెటరీ గారితో చర్చించి డ్రైన్లలో గల పూడిక తొలగించాలని, ఈ వర్షాకాలం లో కాలువలలో ఎప్పటికప్పుడు సిల్ట్ ను తొలగించాలని, అనంతరము ఈ వర్షాకాలము ను దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా రోడ్లును బాగుచేయలని తెలిపారు, అనంతరము దామిరెడ్డిపల్లి లో నిర్మాణము అవుతున్న గ్రామ సచివాలయంను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ కే.రత్న కుమారి, పంచాయతీ రాజ్ డి.ఈ సూర్యనారాయణ, దామిరెడ్డిపల్లి వైఎస్సార్సీపీ నాయకులు, పంచాయతీ కార్యదర్శి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.