సిఐడి పోలీసుల కళ్ళుగప్పి ఇంటి నుండి పరారయిన టిడిపి నేత వరుపుల రాజా:


 TV77తెలుగు పత్తిపాడు:

కాకినాడ జిల్లా.ప్రత్తిపాడు.సిఐడి పోలీసుల కళ్ళుగప్పి ఇంటి నుండి పరారయిన టిడిపి నేత వరుపుల రాజా గత టిడిపి పాలనలో డిసిసిబి ఛైర్మన్ గా పని చేసిన రాజా.లంపకలోప,ధర్మవరం,గండేపల్లి వ్యవసాయ పరపతి సంఘాల బ్యాంకులలో పెద్దెత్తున జరిగిన అవినీతి అక్రమాలు.విచారణలో రాజా ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన అధికారులు.

సి బీ సి ఐ డీ అడిషనల్ ఎస్పీ గోపాలకృష్ణ కామెంట్స్

లంపక లోవ పీ ఏ సి  ప్రెసిడెంట్ గా పని చేసిన సమయంలో అక్రమాలు జరిగాయి.వరుపుల రాజా గతంలో డీ సి సి బీ ప్రెసిడెంట్ గా పని చేశారు.లంపక లోవ సొసైటీ లో 15 కోట్లు అవినీతి జరిగందని కో అపరేటివ్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి కలెక్టర్ కి నివేదిక ఇచ్చారు.ఆ వ్యవహారం లో లోకక్ పోలీసులు ఎంక్వైరీ చేసి ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి తరువాత సి ఐ డీ కి ఇచ్చారు.హై  కోర్టు నుంచి తర్వాత ఆదేశాలు తెచ్చుకున్నారు.ఇప్పటి వరకు రాజా కి  విచారణ అధికారి నాలుగు సార్లు నోటీసులు ఇచ్చారు.గండేపల్లి సొసైటీ లో అక్రమ జరిగాయి.ఐ ఓ నోటీసు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకుందామని అనుకున్నారు.బయట కార్యకర్తలు ను ప్రేరేరిపించి రాజా లోపలికి వెళ్లారు.కరెంట్ పోయిన టైం లో రాజా బయటకు వెళ్లిపోయారు.నాలుగు నోటీసులు కి సమాధానం ఇవ్వలేదు గనక ఆయనకు కొత్తగా నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయన చేసిన నేరాలు 7 ఏళ్ళు  పైబడినవే ఉన్నాయి, అందుకు 41 ఏ ప్రకారం నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు రాజా తప్పించుకుని పారిపోయాడు అంటే ఆయన దోషి అని అర్ధం అవుతుంది.నిర్దోషి అయితే ఎందుకు తప్పించుకున్నారు. ఆయనకు పెద్దలు అండ ఎందుకు?నిప్పక్షపాతము గా విచారణ జరుగుతుంది.చనిపోయిన వ్యక్తులు బతికి ఉన్నట్లుగా సంతకాలు ఫోర్జరీ చేసి అక్రమాలు చేశారు.పారిపోయిన విషయాన్ని న్యాయ స్థానానికి నివేదిక ఇస్తాము అని వెల్లడి.