రోడ్ కం రైల్వే బ్రిడ్జి పై రాకపోకలు బంద్

 

TV77తెలుగు రాజమహేంద్రవరం :

రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జి పై భారీ వాహనాలను నిషేధిస్తూ అధికారులు చర్యలు చేపట్టారు. వాహనాలను నిలిపేందుకు శనివారం రాత్రి పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. భారీ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లను మాత్రమే రాకపోకలు వెళ్లేందుకు పోలీసులు అనుమతిస్తున్నారు.