TV77తెలుగు సీతానగరం :
ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చొరవతో 30 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఎస్.టి కులస్తులకు ధ్రువీకరణ పత్రాలు పంపిణీ
వేసవి దృష్ట్యా గ్రామాలలో త్రాగునీటి సమస్యలకు పరిష్కారం
సీతానగరం మండలంలో పలు గ్రామాలలో నిర్వహించిన జనబాట కార్యక్రమంలో పాల్గొన్న జక్కంపూడి రాజా
నియోజకవర్గములో ప్రజల వద్దకు వెళ్లి వారి యొక్క సమస్యలను నేరుగా తెలుసుకుని క్షేత్రస్థాయిలో పరిష్కరించడమే జనబాట కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని రాజానగరం శాసన సభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. శనివారం నాడు సీతానగరం మండలంలో నాగంపల్లి, అచ్చయ్య పాలెం,చీపురుపల్లి,పెద్ద కొండేపూడి గ్రామాల్లో నిర్వహించిన జక్కంపూడి జనబాట కార్యక్రమంలో మండలానికి సంబంధించిన అధికారులతో కలిసి ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రజా క్షేత్రంలో ప్రజా సమస్యల పరిష్కరమే ధ్యేయంగా ప్రజలు ద్వారా స్వీకరించిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు.పారదర్శకత, అవినీతి, వివక్షత లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అధికారులకు సూచించారు.అర్హత ఉన్నవారికి పథకాలు అందకపోతే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.నాగంపల్లి గ్రామంలో సుమారు 1కోటి 10 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు.గత 30 సంవత్సరాల కాలంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా నాగంపల్లి గ్రామంలో ఎస్.టి కులస్తులకు కుల ధ్రువీకరణ పాత్రలు జారీ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేడు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేయడం జరిగిందన్నారు.ఇంకా ధ్రువీకరణ పత్రాలు అందక ఎవరైతే మిగిలి ఉన్నారో వారికి కుల ధ్రువీకరణ పత్రాలు అందే విధంగా సుమారు 20 కోట్ల రూపాయల వ్యయంతో రాపాక నుండి చినకొండేపూడి వరకు చేపడుతున్న రోడ్ల పనులలో భాగంగా చినకొండేపూడి నుండి చీపురుపల్లి మీదుగా నాగంపల్లి వరకు సుమారు 8 కిలోమీటర్ల రోడ్ల విస్తరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు.నాగంపల్లి ఎస్సీ కాలనీలో నీటి ఎద్దడి నివారణ కోసం ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించి ప్రజల దాహార్తిని తీర్చడం జరిగిందన్నారు.అచ్చయ్యపాలెం గ్రామంలో ప్రజలకు తాగునీటి సమస్యల పరిష్కారం కోసం జలజీవన్ మిషన్ పథకం ద్వారా ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి కుళాయిల ద్వారా ఇంటింటికి తాగునీరు సరఫరా అందించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. చీపురుపల్లి గ్రామంలో మండల ప్రజాపరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల నందు నాడు నేడు పథకంలో భాగంగా 23 లక్షల 13 వేల రూపాయలతో చేపట్టిన ఆధునికరణ పనులను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేతుల మీదుగా ప్రారంభించారు.చీపురుపల్లి గ్రామంలో 37 లక్షల 20 వేల రూపాయలు తో చేపట్టే ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులకు ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. చీపురుపల్లి గ్రామంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం జనబాట కార్యక్రమంలో పాల్గొన్నారు.పెద్దకొండేపూడి గ్రామంలో 29 లక్షల 70 వేల రూపాయలతో 20 వేల లీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ నిర్మాణం మరియు ఇంటింటికి కుళాయిల ద్వారా తాగునీరు అందించే విధంగా చేపడుతున్న పనుల ఆయన స్వయంగా పరిశీలించారు.పెద్దకొండేపూడి గ్రామంలో ఎస్.టి పేటలో చేపడుతున్న సీసీ డ్రైన్ల నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యత విషయంలో రాజీ లేకుండా సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఎవరితే తాటకీల్లు ఇంట్లో నివాసం ఉంటున్నారో వారందరికీ త్వరలోనే ఇల్లు కట్టుకునే విధంగా ప్రభుత్వం తరఫున ఒక లక్షా ఎనభై వేల రూపాయల ఆర్ధిక సహాయం అందించి ఇల్లు కట్టుకునే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. జనబాట కార్యక్రమంలో ఎక్కువగా రేషన్ కార్డులు, పెన్షన్లు,ఇళ్ల స్థలాలు కల్పించాలని గ్రామస్తుల నుండి వినతులు వస్తున్నాయని అర్హత ఉన్న వారందరికీ అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.గ్రామాలలో జనబాట కార్యక్రమం నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషిచేసి గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బాబు,సుజీ రాజు,పి.పి రాజు, గుర్రాల జ్యోస్న, సత్తిపండు రాజు,దోసపాటి వీర చంద్రరావు,గోప్పిశెట్టి సత్య అనురాధ, సురేష్ రాజు ముసలయ్య,ఎం.డి.ఓ రమేష్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.