పెళ్లికి అంగీకరించలేదని ప్రియురాలు ఆత్మహత్య


  TV77తెలుగు  విశాఖపట్నం :

ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించడంతో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన పెదబయలు మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై మనోజ్‌కుమార్‌ వివరాల మేరకు . పెదబయలు మండలం లింగేటి పంచాయతీ వనకుంతురు గ్రామానికి చెందిన కర్జ అనూరాధ (32), విశాఖపట్నం లోని సుజాతనగర్‌కు చెందిన ఓ గుత్తేదారు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. గుత్తేదారుకు ఇప్పటికే వేరే మహిళతో వివాహమైంది. అతడు లింగేటి పంచాయతీ పరిధిలో నిర్మాణాలు చేయిస్తుంటాడు. ఈనెల 23 న తాము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు యువతి తన తల్లిదండ్రులకు చెప్పింది. అతడికి ఇప్పటికే వేరే మహిళతో వివాహమవ్వడంతో ఆమె తల్లిదండ్రులు వారి పెళ్లికి అంగీకరించలేదు. ఈ క్రమంలో గత ఆదివారం తల్లిదండ్రులు పక్క గ్రామానికి వెళ్లగా. యువతి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి కఅష్ణారావు ఇంటికి వచ్చేసరికి కూతురు వాంతులు చేసుకుంటుండటంతో వెంటనే జి.మాడుగుల ఆసుపత్రికి, అక్కడి నుంచి పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది.