రాజమహేంద్రి మహిళా డిగ్రీ అండ్ పీ.జీ కళాశాల ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు కు ట్రాఫిక్ సమస్యలపై అవగాహన కార్యక్రమం


 TV77తెలుగు రాజమహేంద్రవరం:

రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు  పీ.జీ కళాశాల ఎన్.ఎస్.ఎస్. 1 వ యూనిట్ మరియు 2 వ యూనిట్ లచే నిర్వహించబడుతున్న జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం 6 వ రోజు  ట్రాఫిక్ రూల్స్ మరియు సమస్యలపై ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు మరియు ప్రజలకు అవగాహన కార్యక్రమం ది. 15-03-2022 మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  కే. సుధాకర్ పట్నాయక్  విచ్చేసి రాజమహేంద్రవరం మున్సిపల్ కాలనీ  గ్రౌండ్ దగ్గర సచివాలయం మేడ పైన ఉన్న మున్సిపల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్ లో వాలంటీర్లకు మరియు మున్సిపల్ కాలనీ ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ మరియు సమస్యల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్క్రీన్ పై చూపిస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ని తప్పనిసరిగా పాటిస్తే ఏ విధమైన యాక్సిడెంట్లు గాని, ప్రాణ నష్టం గాని జరగదని తద్వారా కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటాయని అన్నారు.అనంతరం విద్యార్థినులకు బాగా అర్థమయ్యే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రాక్టికల్ గా ట్రాఫిక్ రూల్స్ ని స్వయంగా పరిశీలించడానికి కళాశాల ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లను ముఖ్య కూడళ్ల దగ్గరకు తీసుకుని వెళ్లి, అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మల్లికార్జున రావు తో వారికి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన ప్రత్యక్షంగా కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్.ఎస్.ఎస్1వ యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ లక్ష్మీ ప్రవీణ, 2వ యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎం.కె.ఎస్. ప్రసాద్, ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు మరియు కళాశాల విద్యార్థినులు  పాల్గొన్నారు.