TV77తెలుగు రాజమండ్రి రూరల్ :
రాజమండ్రి రూరల్ వెంకటనగరం గ్రామంలో రహదారులు శాఖ వారిచే వెంకటనగరం నుండి తొర్రేడు, తొర్రేడు నుండి మిర్తిపాడు మరియు మిర్తిపాడు నుండి మధురపూడి వరకు సుమారు 8.75 కిలోమీటర్లు రోడ్డు 150 లక్షల రూపాయలతో రోడ్ల పునరుద్దరణ పనులను ప్రారంభించిన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు, వైస్సార్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ ఎంపీ భరత్ మాట్లాడుతూ ఈ రోడ్డు పునరుద్దరణ అయితే వెంకటనగరం తొర్రేడు మిర్తిపాడు గ్రామ ప్రజలకు మరియు రైతులకు ఎంతో ఉపయోగం అని తెలిపారు.వెంకటనగరం మరియు తొర్రేడు గ్రామ రైతులు వెంకటనగరం పాత పంపింగ్ స్కీం కొన్ని సమస్యలను ఎంపీ భరత్ దృష్టికి తీసుకుని రాగానే తక్షణమే ఇరిగేషన్ యస్.ఈ గారితో మాట్లాడి ఇవాళ పార్లమెంట్ సమావేశాలకు వెళ్తున్నాను అని శుక్రవారం తిరిగి వస్తానని అప్పుడు ఎంపీ కార్యాలయం నందు కలుద్దామని రైతుల సమస్యలు పరిష్కరించే విధముగా చర్యలు తీసుకుందామని తెలిపారు.రాష్ట్రం లో రోడ్ల పునరుద్దరణ పనులు శరవేగముగా జరుగుతున్నాయని ప్రత్యేకముగా రాజమండ్రి నగరం మరియు రూరల్ లో ఈ రోడ్ల పనులను వేగవంతం చేశామని ఏప్రిల్ లేదా మే నెలాఖరకు పూర్తి చేసే విధముగా అధికారులను కోరినట్టు ఎంపీ భరత్ తెలిపారు.రాబోయే రోజులలో మర్రిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నామని ఎంపీ భరత్ ఈ సందర్భముగా తెలిపారు.ఈ కార్యక్రమంలో వెంకటనగరం ఉప్పులూరి రాము, గ్రామకమిటీ ప్రెసిడెంట్ రమేష్, తొర్రేడు వైస్సార్సీపీ నాయకులు, రైతులు రహదారుల శాఖ ఇంజనీర్ మధుసూదనరావు, వారి సిబ్బంది, కాంట్రాక్టర్ సూరిరెడ్డి, గ్రామ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.