రాజమండ్రి రూరల్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ భరత్


 TV77తెలుగు రాజమహేంద్రవరం రూరల్:

రాజమండ్రి రూరల్, పిడింగొయ్యి గ్రామం పంచాయతీ, గణేష్ నగర్ నందు 68 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, కల్వెర్టలు ప్రారంభోత్సవం మరియు కొన్ని పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న రాజమండ్రి ఎంపీ, వైస్సార్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ శ్రీ మార్గాని భరత్. ఇప్పటికి వరకు నగర అభివృద్ధి పనులు కాకుండా దానికి సమాంతరముగా రూరల్ లోకూడా అభివృద్ధి పనులను చేస్తున్నామని ఎప్పటినుండో గణేశనగర్ లోని నిర్వాసితులు పడుతున్న ఇబ్బందులు రోడ్ల విషయంలో, డ్రైన్లు మరియు మంచినీరు విషయంలో ఈ రోజున అన్ని సమస్యలు తీరిపోనున్నాయని ఈ పనులన్నీ ఏప్రిల్ 15 కల్లా పూర్తి చెయ్యాలని అధికారులకు సూచించారు. రాజమండ్రి రూరల్, బొమ్మూరు గ్రామం పంచాయతీ, మురళీ కొండ, నేతాజీ నగర్ నందు సుమారు 90 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైన్లు, ప్రారంభోత్సవం మరియు కొన్ని పనుల శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ రూరల్ పార్టీ శ్రేణులు, సర్పంచులు, ఎంపీటీసీ లు, నాయకులు కార్యకర్తలు, ఎంపీడీఓ, రెవెన్యూ సిబ్బంది, పంచాయత్ కార్యదర్శులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.