బైబిల్ మిషన్ మహా సభలకు ఢిల్లీ నుండి సందేశం పంపిన ఎంపీ భరత్


TV77తెలుగు ఢిల్లీ :

ఢిల్లీ పార్లమెంట్ సమావేశాలలో వున్న  రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు, వైస్సార్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్  మార్గాని భరత్ తన సందేశాన్ని వీడియో ద్వారా పంపారు. బైబిల్ మిషన్ తో ఎన్నో ఏళ్లుగా తనకు సంబంధ బాంధవ్యలు ఉన్నాయని ప్రతీ రెండు సంవత్సరాలకు జరిగే ఈ సభలను మా మార్గాని ఎస్టేట్స్ లో నిర్వహించడం మా కుటుంబానికి దేవుడు ఇచ్చిన వరమని ఇలా ఎప్పుడు నా నుండి క్రైస్తవ సోదరులకు ఏ సహాయమన్నా చెయ్యడానికి ముందర ఉంటానని ఎంపీ భరత్ తెలిపారు. కొన్ని సాంకేతిక లోపాలు ఉండటంవలన బరియల్ గ్రౌండ్ సమస్య ఆలస్యం అవుతుంది అని త్వరలో అన్ని సమస్యలు అధిగమించి ముందరకు వెళ్తామని ఈ సందర్భముగా ఎంపీ భరత్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

బైబిల్ మిషన్ ద్వారా రూ. 40లక్షలు సాయం చైర్మన్ సామ్యేల్ కిరణ్

నగరంలో ఘనంగా బైబిల్ మిషన్ మహాసభలు

క్రైస్తవ సహోదరులకు ప్రధాన సమస్యగా ఉన్న క్రైస్తవ స్మశాన వాటిక సమస్యపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని బైబిల్ మిషన్, పెదకాకాని, గుంటూరు ఛైర్మన్ రెవరెండ్ డాక్టర్ జె సామ్యేల్ కిరణ్ కోరారు. బైబిల్ మిషన్ సెక్రటరీ రెవరెండ్ కోట్ల ప్రశాంతకుమార్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్వి ఫంక్షన్ హాల్లో ఈనెల 16 నుండి మూడు రోజుల పాటు బైబిల్ మిషన్ మహాసభలు జరిగాయి. ఈ మహాసభలలో సామ్యేల్ కిరణ్ ముఖ్య ప్రసంగీకులుగా పాల్గొని దైవసందేశాన్ని అందజేశారు. క్రైస్తవ జనులు అంతా వాక్యం అనుసారం జీవించాలన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించిన మహాసభలకు వేలాదిగా హాజరయ్యారు. చివరిరోజు శుక్రవారం జరిగిన సభలో సామ్యేల్ కిరణ్ ప్రసంగిస్తూ క్రైస్తవ జనులు ప్రతీ ప్రాంతంలో కూడా స్మశాన వాటిక సమస్యను ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం తక్కువ ధరలకు స్థలాలను సమకూర్చితే కొనుగోలు చేయడానికి ముందుకు వస్తామన్నారు. బైబిల్ మిషన్కు స్మశాన వాటిక స్థలాలు సేకరణ నిమిత్తం బైబిల్ మిషన్ తరపున రూ.40లక్షలు ఆర్ధిక సాయాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు.అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు మార్గాన్ని భరత్ ఈ విషయంలో చొరవ తీసుకుని ప్రయత్నాలు చేస్తుండటం ఆనందించతగ్గదని తెలిపారు, తప్పక ఎంపీ భరత్ మన కోసం బరియల్ గ్రౌండ్ సాధించి తీరతారని ఆకాక్షించారు. దేవదేవుడు ఈ విషయంలో ఎంపీ భరత్ కు తోడుగా ఉంటారని తెలిపారు. ఈ మహాసభలలో జాయింట్ సెక్రటరీలు రెవరెండ్ డి సుధాకర్, రెవరెండ్ జి ఆగమనరావు, రెవరెండ్ సజీవరావు, ఉపాధ్యక్షులు పి జాన్ దేవదాసు, గవర్నింగ్ బాడీ మెంబర్స్, రెవరెంండ్లు, యాచకులు పాల్గొని దైవ సందేశాన్ని అందజేశారు. ఉ భయగోదావరి జిల్లాల నలుమూలల నుండి విచ్చేసిన వేలాది మంది భక్త జనులకు భోజన సదుపాయాలు కల్పించారు.