TV77తెలుగు పీలేరు:
ధరణి లెక్సీ స్వగర్ ప్రొడక్షన్ నెం.1"త్రికనురాగ్" షూటింగ్ కార్యక్రమాలు శుక్రవారం పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి చేతుల మీదుగా చిత్తూరు జిల్లా, పీలేరు పట్టణ శివార్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రారంభమయింది. ఎమ్మెల్యే తొలుత పూజా కార్యక్రమాలు నిర్వహించి, మూహర్తపు షాట్ కు క్లాప్ కొట్టి ప్రారంభించారు. అలాగే మూవీ కి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మనిషికి సంకల్పబలం, మనోధైర్యం ఉంటే మత్తు పదార్థాల వ్యాసనాన్ని జయించవచ్చు అనే ఇతివృత్తం తీసుకుని నిర్మించిన ఒక సందేశాత్మక చిత్రమని, ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. చిత్ర దర్శకుడు జ్ఞాన క్రాంతి కిరణ్ మాట్లాడుతూ తాను తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గత సంవత్సరం ఇదే తేదీకి చిత్రరంగ ప్రవేశం చేశానని, సంవత్సరం తర్వాత ఒక చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బాధ్యతలు వహిస్తున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు.ఈ చిత్రంలో స్థానిక కళాకారులను ప్రోత్సహిస్తూ అధిక భాగం స్థానికులునె తీసుకున్నట్లు తెలిపారు, పై కార్యక్రమంలో ఎంపీపీ కంభం సతీష్ కుమార్ రెడ్డి, సర్పంచ్ షేక్ హాబీబ్ బాషా,చిత్ర దర్శకుడు జ్ఞాన క్రాంతి కిరణ్ హిహీరో పాత్రధారి సాయి కౌశిక్, హీరోయిన్ లు గా నటిస్తున్న వైష్ణవి, కావ్య శ్రీ, శిల్పానాయుడు, అన్నపూర్ణ, నిర్మాతలు మల్లికార్జునరావ్, కిరణ్ సాయి, తరుణ్ కుమార్ రెడ్డి, నటీనటులు తరుణ్ కుమార్, ఈశ్వర్, అనురాధ, చిత్రంలో నటిస్తున్న కళాకారుల, నిర్మాతల తల్లిదండ్రులు, బంధువులు, స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.