TV77తెలుగు కొయ్యలగూడెం:
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇరవై ఆరు జిల్లాలకు ప్రకటించిన నేపథ్యంలో కొయ్యలగూడెం పట్టణ పార్టీ అధ్యక్షుడు సంకు కొండ ఆధ్వర్యంలో విద్యార్థి విభాగం నాయకులతో కలిసి పోలవరాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని కొయ్యలగూడెం గవర్నమెంట్ కాలేజీ నుంచి తాసిల్దార్ ఆఫీస్ వరకు పాదయాత్రగా వెళ్లి తహసిల్దార్ నాగమణికి వినతి పత్రం సమర్పించారు కొండా మాట్లాడుతూ భారతదేశంలోనే జాతీయ ప్రాజెక్టుగా పేరుగాంచిన పోలవరాన్ని జిల్లాగా జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి , ఏలూరు పార్లమెంటు సభ్యులు కోటగిరి శ్రీధర్ , పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు కి విన్నవించుకుంటున్నాము అని తెలిపారు ఈ కార్యక్రమంలో యువజన నాయకులు నూకల రాము, గవర్నమెంట్ హాస్పటల్ డెవలప్మెంట్ చైర్మన్, మారిశెట్టి శ్రీనివాస్, ఎంపీటీసీ, జాన్ డేవిడ్ కింగ్, యువజన నాయకులు, చిటికెల నాగార్జున, పట్టణ యూత్ ప్రెసిడెంట్, ఏలేటి భాస్కర్, విద్యార్థి విభాగం నాయకులు, కండల్ని శివ , వార్డ్ నెంబర్, పూలపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.