ఎమ్మెల్యే చేతులమీదుగా ధరణి లెగ్జి స్వగర్ ప్రొడక్షన్ నెం.1 చలన చిత్రం షూటింగ్ ప్రారంభం


 TV77తెలుగు  పీలేరు :

ధరణి లెగ్జి స్వగర్ ప్రొడక్షన్ నెం.1 షూటింగ్ కార్యక్రమాలు ఎమ్మెల్యే చేతులమీదుగా శుక్రవారం  పీలేరు పట్టణ శివార్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రారంభమవుతుందని మూవీ డైరెక్టర్ జ్ఞాన క్రాంతి కిరణ్ స్థానిక తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.ఇది సందేశాత్మక చిత్రమని, ఈ చిత్రం ద్వారా మనిషి సంకల్ప బలం ముందు ఏ మత్తు పదార్థాలు పనిచేయవని సందేశం ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే హైదరాబాదులో ఆడిషన్స్ నిర్వహించి మంచి నటీనటులను ఎంచుకున్నామని తెలిపారు. ఈ చిత్రంలో స్థానిక కళాకారులకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. షూటింగ్ కూడా పీలేరు పరిసర ప్రాంతాలను ఎంచుకున్నామని, ప్రేక్షకులు తప్పకుండా తమ చిత్రాన్ని ఆదరిస్తారని నమ్మకం ఉన్నట్లు ఆకాంక్షించారు. ఇందులో హీరోగా సాయి కౌశిక్,నలుగురు హీరోయిన్స్ గా  వైష్ణవి, కావ్య శ్రీ, శిల్పానాయుడు, అన్నపూర్ణ నటిస్తున్నారని, ఇందులో ఇంకా తరుణ్ కుమా,ర్ ఈశ్వర్, అనురాధ, ఇంకా కొంతమంది సినీ ప్రముఖులు కూడా నటించనున్నట్లు తెలిపారు. మల్లికార్జునరావ్ @జి.ఎం.ఆర్, కిరణ్ సాయి, తరుణ్ కుమార్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి  కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ తానే నిర్వహిస్తున్నట్లు జ్ఞాన క్రాంతి కిరణ్ తెలిపారు.