TV77తెలుగు పీలేరు :
అంతరించిపోతున్న మన కళలు, సంస్కృతి, సంప్రదాయాలను బ్రతికించాలి అనే ఉద్దేశంతో 108 జానపద భక్తి గీతాల సంగీత జపమాల కార్యక్రమాన్ని "మన సంస్కృతి కళా సంస్థ" తిరుపతి వారి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా, పీలేరు పట్టణంలో ఫిబ్రవరి 20వ తేదీ నిర్వహించనున్నట్లు పీలేరు వి.ఎస్ నర్తనశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పై సంస్థ ప్రధాన కార్యదర్శి కలకట రెడ్డప్ప తెలిపారు. ప్రతిభ ఉండి గుర్తింపు లేక అవకాశాల కోసం ఎదురు చూస్తున్న కళాకారులను వేదికపైన పాడే అవకాశం కల్పిస్తామని, కాబట్టి భక్తి గేయాలు, భజన పాటలు, జానపద గేయాలు దేశభక్తి గేయాలు, అభ్యుదయ గేయాలు, పల్లె పాటలు పాడాలనుకొనే కళాకారులు తన మొబైల్ నెంబర్ 9618489171 కు సంప్రదించాలని తెలిపారు. ఇంకా వారు కార్యక్రమంలో పాల్గొన్న తలచిన వారికి నియమ నిబంధనలను గురించి చెబుతూ వారు పాడే పాటలు,గేయాలు కుల, మత, రాజకీయ, వ్యక్తిగత విమర్శలు గాని, పొగడ్తలు గాని ఉండకూడదని అన్నారు. ప్రతి ఒక్కరూ రెండు పాటలు వాడవచ్చునని వారు ఏ పాట పాడుతారు ముందుగా తెలపాలని అన్నారు. పై కార్యక్రమంలో అంతర్జాతీయ కళాకారుడు మయూరి నాథ్ శర్మ, కళాకారుడు మరియు పాత్రికేయుడు ఆల్ ది బెస్ట్ ఖాదర్ భాష, సామాజిక సేవకుడు జానం గంగిరెడ్డి, బండి ఈశ్వర్, పులి శ్రీనివాసులు,ఐకాన్ యాక్టింగ్ వ్లాగ్స్ వ్యవస్థాపకులు కొండా వెంకట కుమార్ తదితరులు. పాల్గొన్నారు.