సొమ్ము ఆమెది.. సోకు ఆమె పిఏది..!


 TV77తెలుగు  రాజమహేంద్రవరం:

ఆమెది సహృదయం..ఏ పండుగ, సంతోషమొచ్చిన నలుగురిని ఆనందభరిచే స్వభావం ఆమెది...ఆమె రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి. ఆమె దాతృత్వ హృదయానికి, సంకల్పానికి ఆమె పిఏ తూట్లు పొడిచి నలుగురికి ఆమెను చులకన చేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా రాజమండ్రి పాత్రికేయులను సంతోషపరచాలనుకున్న ఆమె ఆలోచన ఆమె పి.ఏ వల్ల బెడిసి కొట్టింది. పాత్రికేయులకు పండగ పురస్కరించుకుని షర్మిళ రెడ్డి వెయ్యి రూపాయలు విలువ చేసే డిన్నర్ సెట్లను బహుమతి ఇవ్వాలని సంకల్పించారు.దీంతో సంక్రాంతి రోజున డిస్వర్ సెట్ల పంపిణీని అమె వ్యక్తిగత సహాయకుడు ద్వారా పంపిణీ చేయాలనుకుంటే ఆ పిఏ తన సొంత పెత్తనం తో చేపట్టారు. అయితే ఆ పిఏ కొంతమంది ఆయనకు నచ్చిన,మెచ్చిన పాత్రికేయులకు మాత్రమే ఫోన్ చేసి డిన్నర్ సెట్లను అందచేయడంతో ఫోన్ పిలుపు రాని వారి నుండి. ఆయనకి తిరిగి ఫోన్ల తాకిడి ఎదురైందట. పాత్రికేయుల జాబితాను ఎవరు ఇచ్చారు. అందులో తమ పేరు ఎందుకు లేదంటూ కొంతమంది పాత్రికేయులు వాగ్వివాదాలు కూడా జరిపారట. పాత్రికేయులకు తాయిలాల పంపిణీపై సామాజికమాధ్యమాల్లో చురుగ్గాపోస్టింగ్లు పెట్టే ఒక ఛానెల్ పాత్రికేయుడు దళారీలకు 'డిన్నర్ సెట్లు' అంటూ పోస్టింగ్ పెట్టి ఆపై కొద్దినిమిషాలలోనే తొలగించేయటం కొసమెరుపు. ముందుగా 20 మందికి మాత్రమే అదేనండి ఆయన నచ్చిన,మెచ్చిన వారికే పరిమితం.చేసి డిన్నర్ సెట్లు అందాయంటున్నారు, కొందరు అందని పాత్రికేయులు. పత్రికాపరంగా ప్రచారం ఇవ్వటమే కాకుండా రాజకీయంగా కూడా బహిరంగంగా మేడపాటి షర్మిలారెడ్డి దంపతులకు అండదండలుగా నిలిచిన స్థానిక పత్రికా నిర్వాహకుడికి, అయన వెంట ప్రయాణిస్తున్నవారికి కూడా డిన్నర్ సెట్లు అందకపోవడం చూస్తుంటే పంపిణీ ఏ విధంగా జరిగింది అర్దం అవుతుంది.  షర్మిలారెడ్డి రుడా చైర్పర్సన్ గా బాధ్యతల స్వీకరణ సందర్భంగా కూడా పి.ఏ కొద్దిమంది పాత్రికేయులకు మాత్రమే  పంపిణీ చేశారనే ప్రచారం అప్పట్లోనే జరిగింది. ఆ మొత్తం అందని వారు డేవిడ్ తో వాదులాటకి దిగిన సందర్భం కూడా అప్పట్లోనే చోటు చేసుకుంది. ఇప్పుడు డిన్నర్ సెట్ పంపిణీ సందర్భంగా అదే సీన్ పునరావృతమైందని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ వ్యక్తిగత సహాయకుని వంకర బుద్ది ఒక సీనియర్ పాత్రికేయుడు  పర్మిలారెడ్డి వ్యక్తిగత సహాయకునిగా ఉన్న ఆయనను తప్పించాలని సూచించారట...!!!