కరోనా కాలంలో అమ్మకాల్లో డోలో 650 టాబ్లెట్ రికార్డు..!


 TV77తెలుగు  హెల్త్ న్యూస్ :

మన ఇంట్లో ఎవరికైన తలనొప్పి, ఒంటి నొప్పులు, జ్వరం ఇలా ఏదైనా సరే వస్తే వెంటనే మనందరికీ డోలో 650 గుర్తుకొస్తుంది. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు దీనిని ఎక్కువగా వాడేస్తునారు ప్రజలు. మన దేశంలో అత్యంత ఆదరణ పొందిన మెడిసిన్‌గా డోలో 650 ఆవిర్భవించింది. ఈ మహమ్మారి కాలంలో దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన మెడిసిన్‌గా నిలిచింది. మార్చి 2020 నుంచి అమ్మకాల పరంగా ఈ డోలో 650 తిరుగులేకుండా దూసుకుపోతుంది.డోలో 650 అనేది ఒక ప్రసిద్ధ పెయిన్ కిల్లర్, ఇది దాదాపు ప్రతి ఇంటిలో కనిపిస్తుంది. ఒంటి నొప్పులు, తలనొప్పి, జ్వరాలకు దీనిని ఎక్కువగా వినియోగిస్తారు. 2020లో కోవిడ్-19 వ్యాప్తి చెందినప్పటి నుంచి భారతదేశం యాంటీ ఫీవర్ ఔషధం డోలో 650లను 350 కోట్ల మాత్రలకు పైగా విక్రయించింది. ఈ మొత్తం 3.5 బిలియన్ మాత్రలను నిలువుగా పేర్చితే ప్రపంచంలోని ఎత్తైన ఎవరెస్ట్ పర్వతం కంటే దాదాపు 6,000 రెట్లు ఎక్కువ ఎత్తు లేదా ప్రపంచంలోని ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా ఎత్తుకు 63,000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. గత రెండు సంవత్సరాలలో డోలో 1.5 సెం.మీ పొడవైన పారాసెటమాల్ టాబ్లెట్, క్రోసిన్ కంటే చాలా ఎక్కువ అమ్ముడైనది.