ఎమ్మెల్యే వసంత కథన రంగం లోకి దిగుతారా...???


 TV77తెలుగు మైలవరం :

తెరవెనుక బూడిద గుమ్మడికాయల బాగోతం బయట పెడతారా..???

బూడిద రవాణా దారులు అధిక శాతం మంది తెలుగు పార్టీ సానుభూతి పరులే....!!!

చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్న బూడిద మాఫియా సామ్రాట్ లు...!!

ఎమ్మెల్యే వసంత మీద నింద వేస్తూ తెర వెనుక రాజకీయం చేస్తున్న తెలుగు నేతలు...!!

బూడిద రాజకీయం లో పావులుగా మిగులుతున్న లారీ డ్రైవర్ లు....!!

ఎమ్మెల్యే రంగం లోకి దిగాలి లోకల్ డ్రైవర్లు కు నిజ నిజాలు తెలియాలి, వారి న్యాయం జరగాలి....

యాష్ పాండ్ లోఅసలేం జరుగుతుందంటే....!!

బూడిద రవాణా చేయడం లో సిద్ధ హస్తులుగా తెలుగు పార్టీ నేతలకు మంచి క్రేజ్ ఉంది బూడిద అక్రమంగా ఎలా రవాణా చేయాలి, ఎలా అమ్ముకొని సొమ్ము చేసుకోవాలో వారికి తెలిసినంతగా బహుశా అధికార పార్టీ నేతలకు కూడా తెలీని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖిల్లా రోడ్ యాష్ పాండ్ తెలుగు నేతల కబంధ హస్తాల నడుమ నలుగుతూనే ఉంది. గత ఐదేళ్ల టిడిపి ప్రభుత్వ పాలనలో ఇష్టా రాజ్యంగా వ్యవహరించిన తెలుగు నేతలు అందిన కాడికి బూడిద మింగేశారు. అంతే కాకుండా మరో ఐదేళ్లకు సరిపడా సొంత గూటిలో దాచి ఇప్పుడు అధికారికంగా అమ్ముకుంటున్నారు.అయితే గతం గతః కానీ ఇప్పుడు జరుగుతున్న తంతు పూర్తి భిన్నంగా జరుగుతోంది. బూడిద రవాణా కు సంబందించి డాక్టర్ ఎన్టీటీపీస్  బూడిదను ఉచితంగా ఇస్తుంది.అయితే సహజంగా ఎవరు అధికారం లో ఉంటే వారి పెత్తనం పని చేయడం ఆనవాయితీ గా వస్తుంది.ఈ నేపథ్యంలో గతం లో టిడిపి పెత్తనం చేయగా ప్రస్తుతం వైసీపీ చేస్తుంది. కానీ బూడిద రవాణా లో కొమ్ములు తిరిగిన సామ్రాట్ లు బూడిద లో దిగబడి పోవడం తో ఒక దశ లో అధికార పార్టీ నేతల పెత్తనం చెల్లడం లేదు అనేది తెలుస్తోంది.జాతీయ రహదారి పనులకు మెగా కంపెనీ ద్వారా బూడిద రవాణా జరుగుతుండగా ఆ రవాణా మాత్రం ఎమ్మెల్యే వసంత అనుచరుడు నడిపిస్తున్నాడు. కానీ మిగతా ఉచిత బూడిద రవాణా మొత్తం పసుపు నేతల కనుసన్నల్లో జరుగుతుండటం గమనార్హం. అందులో భాగంగానే లోకల్ డ్రైవర్లకు బూడిద అందకుండా చేస్తూ వారి ఉపాధి కి గండి కొడుతున్నారు అనేది వైసీపీ నేతల వాదన.ఇక ఇదే అంశం పై ఒక చిన్న ఉదాహరణ.బూడిద రవాణా చేస్తేనే మాకు పూట గడుస్తుంది సామి అని స్థానికంగా ఉన్న వైసీపీ నేతలకు మొర పెట్టుకున్నాడు ఒక డ్రైవర్.అయితే ఆ సమయం లో ఎమ్మెల్యే వసంత తో, ఎమ్మెల్యే అనుచరుడు తో మాటలు లేకపోవడం తో డ్రైవర్ అభ్యర్థన మేరకు బూడిద సామ్రాట్ అయిన ఒక టిడిపి సానుభూతి పరుడికి ఫోన్ చేసిన సదరు వైసీపీ నేత ఆ డ్రైవర్ కు లోడ్ ఇవ్వాలని సిఫార్స్ చేశారట.ఈ ఒక్క ఉదాహరణ చాలదా ఎవరు బూడిద ను ఏలతన్నారో. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్న బూడిద మాఫియా ఇప్పుడు అదే బూడిద లోకల్ డ్రైవర్లు కు ప్రాధాన్యత ఇవ్వాలంటూ ధర్నాలు చేయడం వింత గా ఉంది.ఇష్టా రాజ్యాంగ బూడిద రవాణా చేసేదే వారు.. ఇప్పుడు వారే లోకల్ కి ప్రాధాన్యత ఇవ్వాలంటూ కలరింగి ఇచ్చేది వారే. అంతిమంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ను బాధ్యుడిని చేసి రాజకీయంగా లబ్ది పొందడం.ఇలా ఒక్క దెబ్బకు రెండు కాదు నాలుగు ఐదు పిట్టలు కొట్టగల సమర్థులు తెలుగు నేతలు..వారి చాణక్యత తెలీక అమాయక లారీ డ్రైవర్ లు అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నారు అనే అపోహలో ఉన్నారు. ఇప్పటివరకు ఎమ్మెల్యే వసంత ను బాధ్యుడిని చేసిన నేపథ్యంలో ఇక ఎమ్మెల్యే స్వయంగా రంగం లోకి దిగి బూడిద గుమ్మడికాయల ను తప్పించి లోకల్ డ్రైవర్లు కు రవాణా కల్పించే విధంగా చర్యలు తీసుకుంటే అందరికీ సమ న్యాయం జరుగుతుంది అనేది స్పష్టం అవుతోంది.. ఈ క్రమంలో పడిన నిందలు నిజం చేసుకోవడం కోసం ఎమ్మెల్యే గమ్మున ఉంటారా.?? లేక అసలు అక్కడ ఎం జరుగుతుందో ప్రజలకు తెలిసే విధంగా కదన రంగం లోకి దిగుతారా...?? వేచి చూడాలి.

సత్య..రిపోర్టర్,మైలవరం