కొయ్యలగూడెం గణేష్ సెంటర్ లో కొవ్వొత్తులతో దీక్షిత కోసం నివాళులర్పిస్తున్న మహిళా నేతలు


 TV77 తెలుగు కొయ్యలగూడెం :

దీక్షిత ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి

మైనర్ బాలిక దీక్షిత ఆత్మహత్య కారకులైన వ్యక్తులను చట్టం కఠినంగా శిక్షించాలి అని పశ్చిమ డెల్టా బోర్డు చైర్పర్సన్ గంజి మాలదేవి డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం గణేష్ సెంటర్ లో దీక్షిత ఆత్మశాంతికై కొవ్వొత్తులతో మౌన ప్రదర్శన నిర్వహించారు. మైనర్ బాలిక అయిన దీక్షితను లైంగికపరంగా వేధింపులకు గురి చేసి ఆమె ఆత్మహత్యకు కారకుడైన టిడిపి నాయకుడు జైన్ న్ని అతను ప్రోత్సహించిన వ్యక్తులను దిశ చట్టం కింద కేసులు నమోదు చేసి  శిక్షించాలని నినాదాలు చేశారు. టిడిపి నాయకుడు నారా లోకేష్ తమను లైంగిక వేధింపులకు గురి చేశారంటూ ఆయన దగ్గర ఉండే మహిళ సిబ్బంది స్వయంగా ఆరోపణలు చేస్తే అదిటిడిపి శ్రేణులకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు. యువతులను లైంగికంగా వేధించడం లోకేష్ గురువైతే జైన్ లాంటి శిష్యులు ఆ పార్టీలో కోకొల్లలుగా ఉన్నారని విమర్శించారు. దీక్షిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె ఆత్మశాంతికై నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. వైస్ ఎంపీపీ మట్ట వనజ లక్ష్మి, గంటా పద్మ, కోరం లక్ష్మీ, నిడదవోలు రాజ్యలక్ష్మి, తోట కల్యాణి, బొబ్బర సత్యవతి, పైల కల్యాణి, శంకు కొండ, ఘంటా శ్రీను, పల్లంట్ల శ్రీను, మారిశెట్టి శ్రీను,చిటికెన నాగార్జున, మడుతూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.