ఒక్క ఛాన్స్ తో జగన్ ప్రజలను కోలుకోలేని దెబ్బ కొట్టాడు
ఓటిఎస్ ఒక దోపిడీ పథకం
ఎవరో ఇచ్చిన వాటికి వడ్డీతో లాక్కుంటున్నాడు
రెండున్నరేళ్లలో ఇళ్ల నిర్మాణానికి ఒక్క ఇటుకైనా వేశాడా..?
ఓటిఎస్కు వ్యతిరేకంగా రాజమండ్రి సిటీ టీడీపీ ఆధ్వర్యంలో నిరసన జ్వాల
ఉరే సరి... విషమే గతి అంటూ వినూత్న నిరసన
TV77 తెలుగు రాజమహేంద్రవరం :
ఒక్క చాన్స్ అని అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటిఎస్) పేరుతో ప్రజలను తీవ్రంగా మోసం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు. ఓటిఎస్ను రద్దు చేయాలనే డిమాండ్తో గురువారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాజమహేంద్రవరంలో కదం తొక్కారు. స్థానిక ఆజాద్ సెంటర్లో సభను నిర్వహించి ఓటిఎస్ అమలు చేస్తే పేదలకు ఉరే సరి.. విషమే గతి అన్నట్టుగా సింబాలిక్ గా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు), యర్రా వేణు గోపాలరాయుడు తదితరులు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లతో బలవంతపు వసూలు చేస్తూ, ఒటిఎస్ కట్టకపోతే ప్రభుత్వ పథకాలు నిలుపుదల చేస్తామని బెదిరించడం తగదని హెచ్చరించారు. ఆర్థిక స్తోమత లేని పేదలు ఒటిఎస్ ఎలా కట్టగలరని, పాదయాత్రలో అన్ని మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత మాటమార్చడం సిఎం జగన్మోహరెడ్డికే దక్కిందని ఎద్దేవా చేసారు. పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చాలన్న మహోన్నత లక్ష్యంతో దివంగత సిఎం నందమూరి తారకరామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1983 లో తొలిసారిగా పక్క గృహనిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజలకు ఇల్లు నిర్మించారన్నారు. అప్పటి నుంచి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు ఎందరో ముఖ్యమంత్రులు పేదల ఇళ్ల నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారని వివరించారు. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి పేదల ఇళ్లను ఆదాయ వనరుగా మార్చుకోవాలన్న ఆలోచన కానీ... పక్కా ఇళ్లకు తమ పేర్ల పెట్టుకోవాలన్న ఆలోచన కానీ రాలేదని, ఖజానా నింపుకోవడానికి వన్ టైం సెటిల్మెంట్ పేరుతో పేదల నుంచి రుణ బకాయిలు వసూలు చేస్తూ జగనన్న శాశ్వత గృహ పథకం పేరుతో ప్రజలను మాయ చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు పూర్తయినా ఒక్క పక్క ఇల్లు కూడా నిర్మించకుండా ఎవరో కట్టిన ఇల్లు కు తన పేరు పెట్టుకోవాలని విచిత్రమైన ఆలోచన రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 1983 నుంచి 2013 వరకు కట్టిన ఇళ్లకు ఉన్న రుణ బకాయిలు ఇప్పుడు వన్లైమ్ సెటిల్మెంట్ పేరుతో ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలు రాబట్టేందుకు ఈ ప్రభుత్వం సిద్ధమైందని మండిపడ్డారు. మూడున్నర దశాబ్దాల క్రితం మూడు వేల రూపాయల రుణం తీసుకున్న వారికి పది వేల రూపాయలు పన్నులు వసూలు చేసేలా ఈ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే తెలుగుదేశం పార్టీ ఉద్యమాన్ని ఉదృతం చేస్తుందని హెచ్చరించారు. ఆదిరెడ్డి వాసు బహిరంగ సభలో చాలా ఉద్విగ్న పూరితంగా ప్రసంగించారు. రాజమహేంద్రవరం గడ్డ.. తెలుగుదేశం అడ్డా అని పేర్కొంటూ ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాజమహేంద్రవరం నగరపాలకసంస్థలను 4వ దక్కించుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. ఎన్నికల ముందు అమరావతే రాజధాని అన్న జగన్ అధికారంలోకి వచ్చాక 3 రాజధానులను తెరపైకి తెచ్చారని, పోలవరాన్ని పూర్తిగా నీర్విర్యం చేసారని మండిపడ్డారు. ఓటిఎస్ ద్వారా రూ.10 వేలు కోట్లు సంపాదించాలని ప్రయత్నించిన ప్రభుత్వం బొక్కా బొర్లా పడి రూ 400 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగిందన్నారు. పాదయాత్రలో ముద్దులే.. ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చాక గుద్దులే.. గుద్దులన్నట్టుగా పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓటిఎసను ఉచితంగా ఎందుకు అమలు చేయడం లేదని నిలదీసారు. ఎన్ని సర్వేలు నిర్వహించినా 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేనని, ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టడం ఖాయమన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధిస్తున్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. అసలు సిసలైన తెలుగుదేశం కార్యకర్తలంటే ఎత్తిన జెండాను దించకుండా పనిచేస్తారని అధికార పార్టీ ఏ కార్యక్రమం నిర్వహించినా డ్వాక్రా మహిళలను, వలంటీర్లను తెచ్చుకుని బలుపు అనుకుంటుందని అది వాపు మాత్రమేనని గ్రహించాలని హితవు పలికారు.
ఉరే సరి... విషమే గతి అంటూ వినూత్న నిరసన :
ఓటిఎస్కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టిన తెలుగుదేశం పార్టీ ఉరే సరి... విషమే గతి అంటూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీసుకువచ్చిన ఓటిఎస్ పథకం వల్ల డబ్బులు చెల్లించలేక మాకు ఇక ఉరే సరి... విషయమే గతి అంటూ ప్రదర్శించారు. అనంతరం భారీ ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకుని అక్కడ వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, జిల్లా టిఎన్ టియూసీ అధ్యక్షులు నక్కా చిట్టిబాబు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, రాష్ట్ర మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ, ఉపాధ్యక్షురాలు ద్వారా పార్వతి సుందరి, కార్యనిర్వాహక కార్యదర్శి తురకల నిర్మల, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ, అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, రాజమండ్రి మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, రాజమండ్రి మహిళా కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి మీసాల నాగమణి, మాజీ కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, తంగెళ్ళ బాబీ, సింహా నాగమణి, మర్రి దుర్గ శ్రీనివాస్, నాయకులు ఉప్పులూరి జానకి రామయ్య, నల్లం శ్రీను, పెనుగొండ రామకృష్ణ, కరగాని వేణు, హితకారిణి సమాజం మాజీ ఛైర్మన్ యాళ్ల ప్రదీప్, మరుకుర్తి రవి యాదవ్, షేక్ సుభాన్, ఛాన్ భాషా, చందా సత్రం మాజీ ఛైర్మన్ యిన్నమూరి దీపు, కుడుపూడి సత్తిబాబు, బుడ్డిగ రాధ, గుణవర్తి శివ, నిమ్మలపూడి గోవింద్, అగురు ధన్ రాజ్, మిస్కా జోగినాయుడు, సప్పా వెంకట రమణ, మజ్జి శ్రీనివాస్, జక్కంపూడి అర్జున్, పితాని కుటుంబరావు, సలాది ఆనంద్, జమ్మి సత్యనారాయణ, మొల్లి చిన్నియదవ్, తీడా నరసింహమూర్తి, కర్రి కాశి, వీరా రాము, నాయుడు మాస్టారు, చనపతి సత్తిబాబు, కిలపర్తి నాగభూషణం, బేసరి చిన్ని, కవులూరి వెంకటరావు, బివి శివారెడ్డి, పులి శ్రీనివాస్ రెడ్డి, కంటిపూడి రాజేంద్రప్రసాద్, గరికిన రామారావు, ఉర్లంకల లోకేష్, బొర్రా చిన్ని, హెరిటేజ్ శ్రీను, అప్సరి, మిస్కా రాము, పాలిక శ్యామ్, వింజమూరి సత్యనారాయణ, అట్టాడ రవి, బెజవాడ వెంకట స్వామి, కంచిపాటి గోవింద్, ఉడమల నాగేశ్వరరావు, సంసాని ప్రసాద్, చొక్కాకుల వెంకటేశ్వరరావు, అమీర్, అజీజ్, అంజి, కేబుల్ మురళి, సందక లక్ష్మణరావు, విశ్వనాధ రాజు, యర్రంశెట్టి రాజ్ కుమార్, బర్ల గిరిజ, తుల్లి పద్మ, ఆకుల విజయభారతి, యండి ఖాన్, బూరా రమణ, టిఎన్ఎస్ఎఫ్ సాయి, దుత్తరపు గంగధర్, చాపల చిన్నిరాజు, కానేటి ప్రభు, కానేటి కృపామణి, కందికొండ అనంత్, అంజి, మేరీ, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.