TV77 తెలుగు ఉత్తరప్రదేశ్ :
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన మహిళా బీజేపీ నాయకురాలిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురు యువకులపై కేసు నమోదైంది. బాధితురాలు బీజేపీ మహిళా మోర్చా నాయకురాలని తేలింది. ప్రధాన నిందితుడిని అబ్దుల్లాగా గుర్తించారు. రెండు వర్గాలకు చెందిన కేసు కావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటన మంగళవారం (21) జరిగినట్లు తెలుస్తోంది. మీడియా కథనాల ప్రకారం. ఈ కేసు ఖర్ఖోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని హాపూర్ రోడ్‌లోని కాశీరామ్ కాలనీలో చోటు చేసుకుంది. అత్యాచార ఘటన రాత్రి 8 గంటల సమయంలో చోటు చేసుకుందని భావిస్తున్నారు. బాధితురాలు ముగ్గురు పిల్లల తల్లి అని తెలుస్తోంది.