TV77 తెలుగు పీలేరు :
చిత్తూరు జిల్లా, పీలేరు పట్టణం, అయ్యప్ప రెడ్డి కాలనీ, జడ్పీ బాలికోన్నత పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థినులకు వ్యాసరచన, వక్తృత్వ,క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలైన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు.విద్యార్థినులు గణిత మోడల్స్ ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఎన్.జయమ్మ మాట్లాడుతూ సున్నాను కనిపెట్టిన భారతీయులు ప్రపంచ గణిత శాస్త్రానికి అద్భుతమైన కానుక అందించారని. దశాంశ పద్దతిని గుర్తించింది కూడా భారతీయులే కావడం విశేషమని అన్నారు. భారతీయ గణిత చరిత్రకు శ్రీనివాస రామానుజన్ మెరుగులు దిద్దారు. వారు ఏది చేసినా గణితం ప్రకారమే ఆలోచించే వారని, గణితంలో ఎన్నో ప్రయోగాలు చేసి ఫలితాలను మనకు అందించారని, వారిని గణిత మెజిషియన్ అని కూడా అంటారని అన్నారు. మేధావులు ఎప్పుడూ అతి చిన్న వయసులో చనిపోతారనడానికి నిదర్శనం రామానుజన్ తన 32 ఏళ్ల అతి చిన్న వయసులోనే క్షయ వాధితో చనిపోవడం అని అన్నారు. గణిత శాస్త్రంలో ఆయన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆయన పుట్టిన రోజున జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించింది. ఆయన జీవిత ఆధారంగా ద మ్యాన్ హూ నో ఇన్ఫినిటీ పేరుతో సినిమా కూడా విడుదలైందని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ని బాగా చదివి రామానుజన్ అంతటి వాడు కావాలని ఆకాంక్షించారు. పై కార్యక్రమంలో పాఠశాల బోధన సిబ్బంది ఝాన్సీలక్ష్మి, గ్లోరి, వై.విజయలక్ష్మి, మధులత, సుధారాణి, జానం సుజాత, శ్రీకల, సౌజన్య, రామచంద్ర, ప్రసన్నలక్ష్మి, స్వప్నలత, విజయ కుమారి, పి.డి సంపూర్ణమ్మ, బోధనేతర సిబ్బంది చరిస్మా, రేష్మ, రమణారెడ్డి, విద్యార్థినులు పాల్గొన్నారు.