ఎస్ ఐ చర్యను ఖండించిన బహుజనప్రజా చైతన్య వేదిక


 TV77 తెలుగు గుంటూరు:

గుంటూరు జిల్లా, అడవులదీవి మండలానికి సంభందించిన గుడిపల్లి కృష్ణారావు అనే బీసీ గౌడ కులానికి చెందిన వ్యక్తి.. ఒక సివిల్ కేసులో తనకి న్యాయం చేయాలని గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ ని కలసి కంప్లైంట్ చేశాడని కృష్ణారావు ని స్టేషన్ కి పిలిపించి ఇష్టం వచ్చినట్లు ఎస్ ఐ రామకృష్ణ కొట్టడం జరిగింది. ఈ చర్యను బహుజనప్రజా చైతన్య వేదిక పక్షాన తీవ్రంగా ఖండిస్తూ.సదరు ఎస్ ఐ ని వెంటనే సస్పెండ్ చేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు.