మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు కలుపుతూ అవుటర్ రింగ్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్ ఎంపీ భరత్ రామ్


 TV77 తెలుగు రాజమహేంద్రవరం:

భూసేకరణ నిధులతో పాటు నిర్మాణ వ్యయం కూ డా కేంద్రం నిధులతోనే.

మోరంపూడి, దివాన్ చెరువు జంక్షన్ ల  ఫ్లైఓవర్ లకు టెండర్లు

టెండర్లు ఖరారైన రోజే మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభం

రు.125 కోట్లు ప్రత్యేక నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

ప్రతిపాదిత పనులన్నిటికీ కార్యరూపం

రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గానికి మహర్దశ

నూతన సంవత్సరంతో సువర్ణ అధ్యాయం మొదలు

రాజకీయాలకతీతంగా అందరూ అభివృద్ధికి కృషి చేద్దాం

రు.135.87 కోట్లతో ఫ్లైఓవర్లు

18 నెలల్లో పూర్తి చేయాలని జీవో

రాజమండ్రి చరిత్ర లో చాలా కాలం తరువాత సువర్ణక్షరాలతో లికించదగ్గ రోజుగా వర్ణించవొచ్చు.

దేశంలోనే అతి ప్రమాదకరం అయిన మోరంపూడి జంక్షన్ ఒకటి. గతంలో ఈ జంక్షన్ ఫ్లైఓవర్ గతంలో శాంక్షన్ అయ్యిన విషయం అందరికీ తెలిసిందే. గేమన్ బ్రిడ్జ్ రావడం వలన ఈ ఫ్లైఓవర్ అవసరం లేదని ఇన్స్పెక్షన్ కి వచ్చిన కేంద్రబృందం తిరస్కరించబడింది. ఒకసారి తిరస్కరించబడిన ఫ్లైఓవర్ ను పునఃసమీక్ష చెయ్యరు. కానీ ఈ విషయంపై కేంద్ర మంత్రివర్యులు  నితిన్ గడ్కరి  దృష్టికి తీసుకొని వెళ్లి మళ్ళీ కేంద్రప్రభుత్వ బృందాన్ని తీసుకుని వచ్చి దీనిని శాంక్షన్ చేయించడం జరిగింది.ఎంపీ, వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ వెల్లడి