నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ బూడిద రవాణా....!!


 TV77తెలుగు మైలవరం:

ఎన్టీటిటిపీస్ అధికారుల ధన దాహానికి బలై పోతున్నాం...!!

ప్లాంట్ లో ఉద్యోగాలు చేస్తున్నవారు అక్రమంగా  బూడిద రవాణా చేస్తూ మా పొట్ట కొడుతున్నారు...!!

నిబంధనలకు విరుద్ధంగా లేని బ్రిక్ కంపెనీలకు బూడిద తరలిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు...!!

డాక్టర్ ఎన్టీటీపీఎస్ ప్లాంట్ లోని బూడిద రవాణాపై స్థానిక యూనియన్ నేతల తీవ్ర అభ్యంతరం...!!

నిబంధనలకు విరుద్ధంగా ఎన్టీటిటిపీస్ లోని శైలో విభాగం నుండి బూడిద రవాణా జరుగుతోందని స్థానిక యూనియన్ నాయకులు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ప్లాంట్ లో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం బూడిద రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అని ఫలితంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రస్తుతం నడవని కంపెనీలు సైతం బూడిద రవాణా చేస్తూ ఇతరులకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు అని యూనియన్ నేతలు ఆరోపించారు. ఇటీవల కాలంలో జరిగిన విజిలెన్స్ దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తున్న బూడిద లారీలను పట్టుకున్నట్లు తెలిపారు.అయితే పట్టుబడిన ఆ లారీలు అదే ప్లాంట్ లోని ఒక ఉద్యోగి లారీలు గా నిర్ధారించుకుని మళ్ళీ యధావిధిగా వదిలేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ విధంగా బూడిద లారీ రవాణా విషయంలో అధికారుల అండదండలతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని స్థానిక యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 25 ఏళ్లుగా స్థానికంగా ఉంటూ బూడిద రవాణా చేస్తున్న తమకు నిబంధనలు వర్తిస్తాయని కానీ ప్లాంట్ లో పనిచేసే ఉద్యోగులకు నిబంధనలతో పట్టింపు లేదు అన్నట్లు గా వ్యవహరించడం బాధాకరమన్నారు.డాక్టర్ ఎన్టీటీపీఎస్ అధికారుల నియంతృత్వ ధోరణి కారణంగా తాము జీవన ఉపాధి కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇలా తప్పుడు దారిలో రవాణా చేస్తున్న వారిని కట్టడి చేసి దానికి లారీ డ్రైవర్ లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రిపోర్టర్,సత్య..మైలవరం