TV77 తెలుగు రాజమహంద్రవరం :
రాజమహంద్రవరం వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, శ్రీమతి పోసుపో నిరీక్షణ జేమ్స్ ఆధ్వర్యంలో. సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్థానిక 38వ వార్డ్ లోని బీసీ బాలికల హాస్టల్ నందు ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా నిరీక్షణ జేమ్స్ మాట్లాడుతూ.. విద్యార్థుల మధ్య జగన్ అన్న పుట్టిన రోజు జరుపు కోవడం చాలా సంతోషాన్ని కలిగించింది అని, జగన్ అన్నకు చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం. అందులోనూ ఆడపిల్లలు అంటే మరి కాస్త ఎక్కువ ఇష్టం.. ప్రతి బాల బాలికలు చక్కగా చదువు కోవాలని అమ్మవడి, నాడు నేడు , జగన్అన్న విద్యాదీవేన, జగన్అన్న వసతిదీవెన అని చదువు కోసం ఎన్నో పథకాలను సీఎం జగన్ ప్రవేశ పెట్టారు అని అందుకే విద్యార్థులతో కలిసి జగన్ అన్న పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించనన్నారు శ్రీమతి పోసుపో నిరీక్షణ జేమ్స్ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి. ఈ కార్యక్రమంలో పాలుపంచు కొవడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని, మాజీ కార్పోరేటర్ అజ్జరపు వాసు, స్టాండింగ్ కమిటీ చైర్మన్ బర్రె కొండబాబు, లాయర్ అశోక్ కుమార్, ఐటీ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కుమార్ గౌడ, జిగ్లర్, నందం స్వామి, సప్పా ఆదినారాయణ, మణికంఠ రెడ్డి, కొమ్మోజు దుర్గారావు, వుల్లూరి రాజు, అనంత లక్ష్మి , కృష్ణ వేణి, బీసీ హాస్టల్ వార్డెన్ రాణి శకుంతల, సామాజికవేత్త కావూరి వరలక్ష్మి ,మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.