TV77తెలుగు హైదరాబాద్:
బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ద్విచక్ర వివాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో భార్యభర్తలతో పాటు కూతురు కూడా మృతి చెందారు. దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.