ప్రచార పర్వం లో ప్రభంజనం


 TV77తెలుగు కొండపల్లి :

వైసీపీ అభ్యర్థుల్లో గెలుపు ఉత్సాహం రెట్టింపు చేస్తున్న ప్రజా ప్రతినిధుల ఎంట్రీ...!!!

వైసీపీ అభ్యర్థులకు కలిసొస్తున్న జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ గరికిపాటి శ్రీదేవి ప్రచారం...!!!

మహిళా ఓటర్లను కలుపుకుపోవడం లో మంచి ఫలితాలిస్తున్న మహిళా ప్రజా ప్రతినిధుల ప్రచారం...!!

కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో అధికార వైసీపీ ప్రచార వ్యూహాలు మంచి ఫలితాలు రాబడుతున్నట్లు కనిపిస్తోంది.  ప్రచార పర్వం లో భాగంగా మహిళా ప్రజా ప్రతినిధులను రంగంలోకి దింపిన వైసీపీ ఇదంతా మహిళా ఓటర్లను ఆకర్షించే అస్త్రాలు ఉపయోగపడుతున్నాయి. వారిలో ప్రధానంగా జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ గరికిపాటి శ్రీదేవి ఒకరు.. కొండపల్లి మున్సిపాలిటీ వ్యాప్తంగా ఉన్న 29 వార్డుల్లో విస్తృత ప్రచారం చేస్తూ వైసీపీ అభ్యర్థుల గెలుపుకు పూల బాటలు వేస్తున్నారు. ఇప్పటి వరకు పర్యటించిన డివిజన్ల లో మంచి ఫలితాలు రావడం తో వైసీపీ శ్రేణులు గెలుపు ధీమాతో పని చేస్తున్నారు. ఏది ఏమైనా మహిళా ప్రజా ప్రతినిధులు చేస్తున్న ప్రచారం తో వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం లో మహిళా ప్రజా ప్రతినిధులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.

రిపోర్టర్,సత్య..మైలవరం