ముడుపులు పంపకంలో తేడాలే ఆ ఇద్దరి కానిస్టేబుల్ మధ్య ఘర్షణ కారణమా.?


 TV77తెలుగు రాజమహేంద్రవరం క్రైమ్:

వడ్డీ వ్యాపారం సివిల్. భూ వివాదాలతో ఆ కానిస్టేబుల్ కు మామూలే..

శాఖ పరువు తీస్తున్న పోలీసులు..

చర్యలకు వెనుకడుగు వేస్తున్న అధికారులు..

రాజమహేంద్రవరం క్రైమ్ :

ఇటీవల రాష్ట్ర పోలీసులు విధేయత ర కార్యకలాపాల్లో పాల్గొంటూ. కోడ్ ఆఫ్ కాండాక్ట్ ముల్లంగి స్తూ పోలీస్ శాఖ పరువు తీస్తున్న సంఘటనలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు తేలిగ్గా తీసుకోవడం మిగతా వారికి అవకాశం ఏర్పడుతుందని తెలుస్తుంది. రాజమహేంద్రవరం అర్బన్ పోలీస్ పరిధిలో తాజాగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సీనియర్ కానిస్టేబుల్ రఘురాం కోర్టు కానిస్టేబుల్ శ్రీను మధ్య ఘర్షణ చోటు చేసుకుని చివరకు కొట్టుకునే ఇంతవరకు రావడం పోలీస్ అధికారులను సిబ్బందికి విస్మయానికి గురిచేసింది. ఇద్దరు కానిస్టేబుళ్లు ఘర్షణ పడుతున్న సమయంలో స్టేషన్ సి ఎ, గోవిందరాజులు ప్రత్యక్ష సాక్షిగా నిలవడం గమనార్హం. ఒక కోర్టు కేసు సంబంధించి ముద్దాయికి వాయిదాలపై అనుకూలంగా వ్యవహరించడం లో " ముడుపులు" చేతులు మారడం పంపకాలు విషయంలో రఘురామ్. శ్రీను ల మధ్య వాదులాట జరిగి చివరకు ఘర్షణ గా మారిందని తెలుస్తోంది. ఈ విషయంపై  సీఐ గోవిందరాజుల ను మీడియా ప్రతినిధి  వివరణ కోరగా ఘర్షణ పడడం వాస్తవమేనని అయితే వారిద్దరూ రాజీ పడ్డారని ఆయన తెలిపారు. 

ఇదిలా ఉండగా ఘర్షణ పడిన కానిస్టేబుల్ లో ఒకరైన రఘురాం గత నాలుగేళ్లుగా ఇదే స్టేషన్ లో "తిష్ట వేసి " చక్రం తిప్పుతున్నాడని. కోడ్ ఆఫ్ కాండాక్ట్ విరుద్ధంగా ఫైనాన్స్ వ్యాపారం  చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా "భూకబ్జాలకు స్థల ఆక్రమణలు" వంటి సివిల్ వివాదాల్లో పాలుపంచుకుంటూ అక్రమ ఆర్జన కు పాల్పడడం వెన్నతో పెట్టిన విద్య అని తోటి సిబ్బంది గుసగుసలాడుతున్నారు. జాతీయ రహదారి ఆనుకొని పిడింగొయ్యి గ్రామ పరిధిలోని లోని 16 రకాల భూమి వివాదాల్లో రఘురాం పాత్రపై రాష్ట్ర "సిఐడి కేసు" నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో పోలీస్ సంక్షేమ సహకార సంఘం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సంఘం నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు  రావడం గమనార్హం.  పోలీసు వర్గాలలో "కుల పెద్దగా" వ్యవహరిస్తూ, శాఖాపరంగా తప్పిదాలకు పాల్పడిన తన సామాజిక వర్గం పోలీసులను రక్షించేలా, బలహీన వర్గాల పోలీసులపై వేటు వేసేలా  ఎస్పి ఆఫీసులో అధికారులను "తప్పుదోవ" పట్టిస్తుంట్టడని ఆరోపణలు ఉన్నాయి.  శాఖాపరంగా విధేయతర కార్యకలాపాలలో పాల్గొంటూ శాఖ  పరువు తీస్తున్న పోలీసుల పై అధికారులు  చర్యలు తీసుకోవడంలో ఉదాసీనత ప్రదర్శించడాన్ని మిగతా కొందరు కూడా ఇతని దారిలోనే వ్యవహరిస్తున్నారని  తోటి ఉద్యోగులే వ్యాఖ్యానించడం కొసమెరుపు.  అర్బన్ ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఇటువంటి పోలీసులపై శాఖపరమైన చర్య తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.